RASI PHALALU TODAY: వారిని తల్లిదండ్రులు మెచ్చుకుంటారు

Rasi Phalalu: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. మరి నేడు ఏప్రిల్‌ 25న గురువారం నాడు, మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పరిశీలిద్దాం.

మేషం (Aries):మార్చి 21-ఏప్రిల్ 19

మీరు సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌, కుటుంబంలో ప్రేమను చూపించడంపై దృష్టి సారిస్తారు. కుటుంబంతో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు. సరైన సమయానికి తల్లిదండ్రులు విలువైన సూచనలు చేస్తారు. మీరు అభివృద్ధి బాటలో ఉంటే, ప్రేమకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వరు. వివాహ అవకాశాల ద్వారా మంచి రిలేషన్‌షిప్‌కి ఎంటర్ అవుతారు. వ్యాపారంలో అడ్డంకులు ఏర్పడవచ్చు, మీ స్ఫూర్తితో వాటిని అధిగమిస్తారు. వర్క్‌లో సమస్యలను పట్టుదలతో పరిష్కరిస్తారు. వ్యాయామం, బ్యాలెన్స్‌డ్‌ డైట్‌ ద్వారా హెల్తీ రొటీన్‌ మెయింటైన్‌ చేయండి. అదృష్ట సంఖ్య 27, అదృష్ట రంగు ఆరెంజ్‌. పాజిటివ్ ఎనర్జీ కోసం ఇంట్లో లక్కీ చార్మ్‌ ఉంచండి.

వృషభం (Taurus):ఏప్రిల్ 20-మే20

ఈరోజు డబ్బును తెలివిగా మేనేజ్ చేయండి. ఇంట్లో శాంతి కోసం మీ తల్లిదండ్రుల సలహాలను వినండి. ప్రేమలో అన్ని విషయాలు స్థిరంగా ఉంటాయి. మీరు లాంగ్‌ టర్మ్‌ కమిట్‌మెంట్‌ గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. వివాహం చేసుకోవడానికి అనుకూల సమయం. వ్యాపారాలలో మంచి పురోగతిని సాధిస్తారు. దృఢ నిశ్చయం, రియలిస్టిక్‌గా ఉండటం ద్వారా వర్క్‌లో సవాళ్లను అధిగమించవచ్చు. క్రీడలు లేదా ఫిజికల్‌ యాక్టివిటీల ద్వారా మంచి అనుభూతి కలుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. శ్రేయస్సు కోసం బ్యాలెన్స్‌ డైట్‌ ముఖ్యం. అదృష్ట సంఖ్య 33, అదృష్ట రంగు బ్లూ. ఇంట్లో ప్రత్యేకమైన క్రిస్టల్‌ ఉంచితే, అదృష్టం లభిస్తుంది.

మిథునం (Gemini):మే 21- జూన్ 21

కుటుంబంతో మీనింగ్‌ఫుల్ కన్వర్జేషన్‌లు చేయండి. మీరు వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి తల్లిదండ్రులు మద్దతుగా ఉంటారు. ప్రేమలో కొన్ని ఎక్సైటింగ్‌ కన్వర్జేషన్‌లు ఉండవచ్చు. కొత్త కనెక్షన్‌లను పొందవచ్చు. వివాహం గురించి ఆలోచిస్తుంటే, మీ ఆసక్తులను పంచుకునే వ్యక్తిని కనుగొనవచ్చు. వ్యాపారంలో, మీ నెట్వర్కింగ్ స్కిల్స్‌ లాభాలు తెస్తాయి. పనిపై దృష్టి పెట్టండి. బాగా మాట్లాడగల సామర్థ్యం, పరిస్థితులకు అనుగుణంగా ఉండటం వల్ల విజయం సాధించవచ్చు. ఆటలు లేదా పజిల్స్‌తో బ్రెయిన్‌ షార్ఫ్‌గా ఉంచుకోండి. మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్‌ చేయడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని పొందండి. అదృష్ట సంఖ్య 56, అదృష్ట రంగు మణి. ఇంట్లో ఇన్‌స్పైరింగ్‌ బుక్‌ ఉంచితే, క్రియేటివిటీ పెరుగుతుంది.

కర్కాటకం (Cancer): జూన్ 22- జూలై 22

ఇంటిని హాయిగా ఉండే ప్రదేశంగా మార్చుకోండి. తల్లిదండ్రులు మీకు ఎమోషనల్ సపోర్ట్‌ అందిస్తారు. ప్రేమలో కనెక్షన్లు మరింత అర్థవంతంగా మారవచ్చు. పెళ్లి జరిగే అవకాశం ఉంటే.. మీ రిలేషన్ ప్రేమ, ఐక్యతతో నిండి ఉంటుంది. వ్యాపారంలో మనసు చేసే సూచనలు అనుసరించండి, మంచి కనెక్షన్లు ఏర్పరచుకోవడంపై దృష్టి పెట్టండి. మీ భావోద్వేగాలు మీ పనిని ప్రభావితం చేయవచ్చు. సానుభూతి, అర్థం చేసుకోవడం ద్వారా విజయం సాధించవచ్చు. వాటర్ స్పోర్ట్స్‌ విశ్రాంతిని అందిస్తాయి. మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ అదృష్ట సంఖ్య 81, ముత్యాలను ధరించడం మీకు అదృష్టం తెస్తుంది. ఇంట్లో ఒక ప్రత్యేక ఫోటోను ఉంచడం వల్ల మానసిక బలం చేకూరుతుంది.

సింహం (Leo):జూలై 23- ఆగస్టు 22

నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించండి, క్రియేటివ్‌గా ఉండండి. మీ తల్లిదండ్రులు మీ ఉత్సాహాన్ని, ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. ప్రేమలో, ఒకరిపై ఒకరు బలమైన ఆకర్షణతో ఇంప్రెస్ చేసుకుంటారు. పెళ్లి గురించి ఆలోచిస్తుంటే, మీకు ఎనర్జెటిక్‌, లైవ్‌లీ రిలేషన్‌ లభిస్తుంది. బిజినెస్‌లో బాధ్యత వహించండి, విజయాన్ని లక్ష్యంగా చేసుకోండి. గుర్తింపు కోరుకోవడం పనిలో సవాళ్లను తీసుకురావచ్చు, మీ సంకల్పం వాటిని అధిగమిస్తారు. కాంపిటీటవ్‌ స్పోర్ట్స్‌ వల్ల ఎనర్జీ పెరుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అదృష్ట సంఖ్య 5, కాంస్య ధరించండి. ఇంట్లో ట్రోఫీని ఉంచుకోవడం మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది..

కన్య (Virgo):ఆగస్టు 23-సెప్టెంబర్ 21

ఆర్గనైజ్డ్‌, ప్రాక్టికల్‌గా ఉండండి. మీ కేర్‌ఫుల్‌ ప్లానింగ్‌ తల్లిదండ్రులను ఆకట్టుకోవచ్చు. ప్రేమలో విషయాలు స్థిరంగా ఉన్నాయి, ఓదార్పునిచ్చే అవకాశం ఉంది. పెళ్లి గురించి ఆలోచిస్తుంటే, మీ రిలేషన్‌ శాశ్వతమైన, స్థిరమైన కలయికగా కనిపిస్తోంది. మీ వ్యాపారంలో ప్రతి అంశాన్ని పరిశీలించండి. కొన్నిసార్లు, పరిపూర్ణత కోసం పని చేయడం సవాలుగా మారవచ్చు, కానీ మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మీ జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్య ఆహారం తీసుకోండి. అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు లేత గోధుమరంగు. ఇంట్లో పెరుగుతున్న చెట్టు ఉండటం పాజిటివ్‌ వైబ్‌లు తీసుకొస్తుంది.

తుల (Libra):సెప్టెంబర్ 23- అక్టోబర్ 23

ఈ రోజు బ్యాలెన్స్‌డ్‌గా ఉండండి. మీ ఇంటిని ఆహ్లాదకరమైన ప్రదేశంగా మార్చుకోండి. మీ తల్లిదండ్రులు సమతుల్యంగా, సంయమనంతో ఉండగల మీ సామర్థ్యాన్ని మెచ్చుకోవచ్చు. ప్రేమలో విషయాలు శాంతియుతంగా, న్యాయంగా ఉంటాయి. వివాహం ఆలోచన ఉంటే, అది ప్రేమతో నిండి ఉంటుంది. వ్యాపారంలో, మీ ప్రయోజనం కోసం నెగోషియేషన్‌ స్కిల్స్‌ ఉపయోగించండి. కొన్నిసార్లు, అనిశ్చితి పనిని సవాలుగా మార్చవచ్చు, ఇతరులతో కలిసి పని చేసే మీ సామర్థ్యం విజయానికి దారి తీస్తుంది. సమతుల్యతను తెచ్చే కార్యకలాపాలు సంతోషపరుస్తాయి. వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ కనుగొనండి. అదృష్ట సంఖ్య 36, అదృష్ట రంగు గులాబీ రంగు. ఇంట్లో ఆర్ట్‌వర్క్‌ ఉంచడం క్రియేటివిటీని అందిస్తుంది..

వృశ్చికం (Scorpio):అక్టోబర్ 24 - నవంబర్ 21

ఈరోజు డీప్‌ కనెక్షన్లపై దృష్టి పెట్టండి, మార్పును స్వీకరించండి. ఇంట్లో సరిగా మాట్లాడండి. తల్లిదండ్రులు మీ విధేయత, స్థితిస్థాపకతను మెచ్చుకోవచ్చు. ప్రేమలో కొన్ని ట్రాన్స్‌ఫర్మేటివ్‌ ఎక్స్‌పీరియన్స్‌లు పొందవచ్చు. పెళ్లి గురించి ఆలోచిస్తుంటే, అది భావోద్వేగంగా లోతుగా, అర్థవంతంగా ఉంటుంది. వ్యాపార నిర్ణయాలలో మీ మనసు మాట వినండి. అధికారం వర్క్‌లో సమస్యలు తీసుకురావచ్చు, మీ సంకల్పం విజయానికి దారి తీస్తుంది. ఫిజికల్‌ యాక్టివిటీస్‌ ద్వారా మీ శక్తిని సానుకూలంగా మార్చుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించే మార్గాలను కనుగొనండి. అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు చార్‌కోల్‌. ఇంట్లో రక్షిత తాయెత్తును ఉంచుకోవడం మీకు భద్రతా భావం పెరుగుతుంది..

ధనస్సు (Sagittarius):నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈరోజు సాహసోపేతమైన పనులు చేస్తారు. తల్లిదండ్రులు మీ ధైర్యమైన స్ఫూర్తిని మెచ్చుకోవచ్చు. ప్రేమలో కొన్ని ఎక్సైటింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌లు ఉండవచ్చు. వివాహం గురించి ఆలోచిస్తుంటే, మీ సాహసోపేత స్ఫూర్తిని పంచుకునే భాగస్వామి దొరికే అవకాశం ఉంది. వ్యాపారంలో, విస్తరణ, ప్రయాణాలపై దృష్టి పెట్టండి. విశ్రాంతి లేకపోవడం పనిని సవాలుగా మార్చవచ్చు, మీ ఆశావాదం విజయానికి దారి తీస్తుంది. అవుట్‌డోర్ యాక్టివిటీస్ వల్ల ఎనర్జీ వస్తుంది. చురుకైన జీవనశైలితో ఆరోగ్యంగా ఉండండి. అదృష్ట సంఖ్య 91, అదృష్ట రంగు ఇండిగో. ఇంట్లో ట్రావెలింగ్‌కి సంబంధించిన జ్ఞాపకాలను ఉంచుకోవడం సాహస భావం పెరుగుతుంది.

మకరం (Capricorn):డిసెంబర్ 22 - జనవరి 19

ఈరోజు క్రమశిక్షణ ప్రధానం, సాధ్యమయ్యే లక్ష్యాలు నిర్దేశించుకోండి. మీ డైలీ రొటీన్స్ మీ తల్లిదండ్రులను ఆకట్టుకోవచ్చు. ప్రేమలో, విషయాలు సురక్షితంగా ఉంటాయి. సహాయక, ఆధారపడదగిన భాగస్వామిని పొందుతారు. కొన్నిసార్లు, చాలా కఠినంగా ఉండటం వర్కలో సమస్యలను సృష్టించవచ్చు, మీ శ్రద్ధ విజయానికి దారి తీస్తుంది. క్రమశిక్షణ అవసరమయ్యే పనులు చేయడం వల్ల సంతృప్తి కలుగుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అదృష్ట సంఖ్య 16, అదృష్ట రంగు గ్రే. ఇంట్లో గడియారాన్ని ఉంచడం వల్ల మీరు ప్రొడక్టివ్‌గా ఉండగలుగుతారు..

కుంభం (Aquarius):జనవరి 20- ఫిబ్రవరి 18

ఈరోజు పురోగతి గురించి మీ కుటుంబంతో కొంత చర్చలు జరుపండి. మీ తల్లిదండ్రులు మీ వినూత్న ఆలోచనలను మెచ్చుకోవచ్చు. ప్రేమ పరంగా, మీరు కొన్ని అసాధారణమైన కనెక్షన్‌లను కలిగి ఉండవచ్చు. వివాహం గురించి ఆలోచిస్తుంటే, మేధోపరమైన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. వ్యాపారంలో, క్రియేటివిటీని ఉపయోగించండి. కొన్నిసార్లు, మీ తిరుగుబాటు వర్క్‌లో సమస్యలను తీసుకురావచ్చు, కానీ మీ వ్యక్తిత్వం విజయానికి దారి తీస్తుంది. టీమ్ స్పోర్ట్స్ వల్ల మీకు ఆనందం లభిస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యం మధ్య బ్యాలెన్స్‌ కనుగొనండి. అదృష్ట సంఖ్య 44, అదృష్ట రంగు ఎలక్ట్రిక్ బ్లూ. ఇంట్లో వినూత్నమైన గాడ్జెట్‌ని ఉంచుకోవడం వలన మీరు స్ఫూర్తిని పొందగలరు..

మీనం (Pisces):ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రోజు అంతర దృష్టి, ఆధ్యాత్మికత ప్రధానం. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించండి. తల్లిదండ్రులు మీ సానుభూతి, సున్నితత్వాన్ని అభినందించవచ్చు. ప్రేమ విషయాలు డ్రీమీ, రొమాంటిక్‌గా ఉంటాయి. వివాహ జీవితం మానసికంగా లోతుగా, అర్థం చేసుకునేలా కనిపిస్తుంది. బిజినెస్‌లో మనసు చేసే సూచనలు విశ్వసించండి. మీ భావోద్వేగ సున్నితత్వం వర్క్‌ని సవాలుగా మార్చవచ్చు. కానీ మీ సృజనాత్మకత విజయానికి దారి తీస్తుంది. వాటర్‌ స్పోర్ట్ష్ మీకు విశ్రాంతిని అందిస్తాయి. అదృష్ట సంఖ్య 18, అదృష్ట రంగు సీ గ్రీన్‌. ఇంట్లో నిర్మలమైన కళాకృతిని ఉంచడం వల్ల మీకు ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది..

Disclaimer:

ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.

2024-04-24T22:45:26Z dg43tfdfdgfd