RGV: చనిపోయిన శ్రీదేవితో ఆ పనులేంటి వర్మ..? ఫోటో వదలడంతో దుమ్ముదుమారం

వివాదాస్పద దర్శకుడిగా నిత్యం వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంటారు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma). ఒకానొక సమయంలో పలు సూపర్ హిట్ మూవీస్ రూపొందించి సినిమా గతిని మార్చేసిన వర్మ.. ఈ మధ్య ట్రాక్ మార్చేసి రచ్చ చేస్తున్నారు. కాంట్రవర్సీ సినిమాలతో పాటు శృంగార భరిత చిత్రాలు రూపొందిస్తూ ప్రస్తుతం రూటు మార్చేశారు ఆర్జీవీ. అమ్మాయిలంటే పడి చచ్చిపోవడం, అందాలను పొగుడుతూ రచ్చ చేయడం వర్మలోని మరో యాంగిల్.

ఇక వర్మకు శ్రీదేవి అంటే ఎంత ఇష్టం అనేది ఇప్పటికే బోలెడన్ని సార్లు బయటపెట్టారు. శ్రీదేవికి భక్తుడు ఆర్జీవీ, ఆమె అందానికి బానిస అయిపోయాడు అన్నట్లుగా ట్రెండ్ క్రియేట్ చేశారు వర్మ. ఏ చిన్న సందర్భం దొరికినా శ్రీదేవి గుర్తు చేసుకొని పరితపించి పోయే ఈ దర్శకుడు, తాజాగా ఓ వినూత్న ప్రయోగం చేశారు. చనిపోయిన శ్రీదేవితో కారులో హాయిగా షికారు కొడుతున్నట్లు ఓ ఫోటో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఈ పిక్ లో వర్మ దమ్ముకొడుతూ కనిపించడం చూడొచ్చు.

కారులో శ్రీదేవి పక్కన కూర్చొని సిగరెట్ కాలుస్తున్న ఫోటోను షేర్ చేసిన వర్మ.. ఆమెను చూడటానికి స్వర్గానికి వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. నిజానికి ఇది టెక్నాలజీ ఉపయోగించి ఎడిట్ చేసిన పిక్. అయితే ఈ ఫోటో చూసి తొలుత షాకైన నెటిజన్లు, ఓ రేంజ్ లో కామెంట్లు చేస్తున్నారు. చనిపోయిన శ్రీదేవితో ఆ పనులేంటి వర్మ? అంటూ ట్రోల్ చేసే వారు కొందరైతే.. శ్రీదేవి అదుర్స్ అంటున్న వారు ఇంకొందరు.

Ration Card: కొత్త రేషన్ కార్డులు ఇచ్చేది అప్పుడే..! ప్రభుత్వం కీలక నిర్ణయం

రామ్ గోపాల్ వర్మతో రెండు సినిమాలు చేసింది శ్రీదేవి. గోవిందా గోవిందా, క్షణ క్షణం సినిమాల్లో వర్మ దర్శకత్వంలో నటించింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ సాధించాయి. ఆ సమయంలో శ్రీదేవితో ఎంతో క్లోజ్ గా మూవ్ అయిన వర్మ, ఆమె మాయలో పడిపోయారు. అప్పటినుంచి ఎన్నో ఇంటర్వ్యూల్లో శ్రీదేవిపై తన ఫీలింగ్స్ బయటపెట్టారు ఆర్జీవీ.

2024-05-02T03:14:21Z dg43tfdfdgfd