RUMOURS: వదిన, మరదళ్ల గాజుల రూమర్స్.. వీటిపై శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే..

తెలంగాణలో సాంప్రదాయాలకు కొదవ ఉండదు. సాంప్రదాయాలతో మనకు తెలియకుండానే బంధుత్వాలు, స్నేహాలు మరింత బలపడి, ఒకరికొకరు మరింత దగ్గరవుతారు.

మరదళ్ళ గాజులు... ఈ సాంప్రదాయం ప్రకారం మరదళ్లూ వారికి వరసైన వదినలకు పుట్టింటి బిడ్డలకు గాజులు, రెండు జాకెట్ ముక్కలు, రెండు దస్తీలు బహూకరిస్తారు. దీనికి కృతజ్ఞతగా మరదళ్ళకు వదినలు ఎంతో కొంత నగదు లేదా బట్టలు కానుకగా ఇస్తారు.

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రాకెట్ లాగా దూసుకుపోతున్న ఈ కాలం లో కుడా మూఢనమ్మకాలు, ఆచారాలు అంటూ చాలామంది కొత్త కొత్త విషయాలను తెరపైకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో అమ్మమ్మ వాళ్ళు మనవరాళ్లకు బంగారం, బట్టలు పెట్టడం కూడకలు పోయడం వంటి పుకార్లు షికారు లేపారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వదినా మరదళ్ల గాజులు మనుమరాళ్లకు గాజులు వేయడం అంటూ ఒక వార్త ఐతే ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే విషయంపై లోకల్ 18 జాతక సిద్ధాంత పండితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది.

కరీంనగర్ కి చెందిన జాతక సిద్ధాంత శర్మ రవి ఈ విషయంపై మాట్లాడుతూ.. పూర్వపు ఆచారాలలో భర్త బయట పనులకు వెళ్ళినప్పుడు క్షేమంగా తిరిగి రావాలని భార్యలు ఇంటి వద్ద అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులతో పూజలు చేసి వాటిని ఇరుగు పొరుగు వారికి వాయినంగా ఇచ్చేవారట. అప్పట్లో ఇది ప్రతి ఇంటిలో ఆచారంగా ఉండేదట. ప్రస్తుత కాలంలో వ్యాపారాలను పెంచుకోవడానికి యజమానులు కొత్త కొత్త విషయాలను తెరపైకి తీసుకువస్తూ.. వాళ్ల వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇలా చేస్తున్నారని రవి పంతులు లోకల్ 18 కు తెలిపారు.

సో ఇలాంటి ఆచారాలు ఇప్పుడు ఏమి లేవు. ఎవరి నమ్మకం వాళ్ళది కాబట్టి మనం కూడా వీరిని తప్పు పట్టే అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే మన ఇంట్లో చేసుకునే పూజలు మనవరకే ఉండాలి ఎదుటివారిని వీటిపై ప్రోత్సహించకూడదని అంటున్నారు.

2024-07-03T11:01:32Z dg43tfdfdgfd