SAI PALLAVI BIRTHDAY SPECIAL: ఆ బిరుదు అందుకున్న వన్‌ అండ్‌ ఓన్లీ హీరోయిన్‌ - నిజంగా.. సాయి పల్లవి 'హైబ్రిడ్‌ పిల్లే!'

Sai Pallavi Birthday Special: హీరోయిన్‌ అంటేనే గ్లామర్‌కు‌ కేరాఫ్‌. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు మేకప్‌ లేనిదే కెమెరా ముందుకు రారు. ఇక ఆఫర్స్‌ కోసం ఎంత గ్లామర్‌ షోకైనా రెడీ అంటారు. కానీ ఈ హీరోయిన్‌ అలాంటి వారికి భిన్నం. ఎంతటి స్టార్‌ హీరో అయినా, డైరెక్టర్‌ అయినా తన రూల్స్‌ ఫాలో అవ్వాల్సిందే.. లేదంటే నో సినిమా. తెర ముందైనా, వెనకైనా తనకు నచ్చినంటే ఉంటానంటుంది. గ్లామర్‌ షో అనేది ఈమే డిక్షనరిలోనే లేదు. అయినా ఆఫర్స్‌ ఈమేను వెతుక్కుంటు వెళతాయి. తన కండిషన్స్‌కి‌‌ డైరెక్టర్స్‌ సరే అంటనే సినిమాకు కమిట్‌ అవుతుంది. అన్ని షరతులు ఉన్నా ఈమే ఇండస్ట్రీలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌. ఇంతకి ఆమె ఎవరనేది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా. అవును.. మీరు అనుకున్నట్టే ఆమె 'హైబ్రిడ్‌ పిల్లా' సాయి పల్లవి. తెరపై నేచురల్‌గా నటిస్తూ తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్న ఈ సౌత్‌ బ్యూటీ బర్త్‌డే నేడు. మే 9న సాయి పల్లవి పుట్టిన రోజు. నేటితో ఆమె 32వ పడిలో అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా సాయి పల్లవి సినీ కెరీర్‌, వ్యక్తిగత జీవితం గురించి ఓసారి చూద్దాం. 

టైంపాస్‌కి వచ్చి హైబ్రిడ్‌ పిల్లగా ముద్ర వేసుకుంది

ఇండస్ట్రీలో సాయి పల్లవికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈమే అందరి హీరోయిన్‌లా కాదు. ఇంకా చెప్పాలంటే ఈమే 'హైబ్రిడ్‌ పిల్లా.. ఒక్కటే పీస్‌' అన్నమాట. సాయి పల్లవికి ఉండే ఫ్యాన్‌ క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అసలు హీరోయిన్ అంటే ఇలా కూడా ఉండోచ్చా! అనేంతగా ఇండస్ట్రీలో కొత్త పుంతలు వేస్తోంది. లేడీ సూపర్‌ స్టార్‌గా ఎంతో మంది హీరోయిన్లు బిరుదు అందుకున్నారు. కానీ 'లేడీ పవర్ స్టార్'‌ బిరుదు అందుకున్న వన్ అండ్‌ ఓన్లీ హీరోయిన్‌ సాయి పల్లవే అనడం సందేహం లేదు. నిజానికి డాక్టర్‌ చదివిన సాయి పల్లవి.. టైంపాస్‌కి సినీ రంగంలోకి అడుగుపెట్టింది. టైంపాస్‌కి సినిమాలు చేసింది. కానీ, తనదైన నటన, డ్యాన్స్‌ స్కిల్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే.. సాయి పల్లవి 1992 మే 9న తమిళనాడులోని కోయంబత్తూర్‌లోని ఓ బడగ హిందూ ఫ్యామిలీకి చెందిన సెంథామరై కన్నన్ - రాధలకు దంపతులకు జన్మించింది. నిజానికి ఆమె స్వస్థలం తమిళనాడులోని నీలగిరి జిల్లా కోటగిరి.

ఫిదాతో ఎంట్రీ

కానీ పెరిగిందంటూ కోయంబత్తూర్‌లోనే. అక్కడే అవిలా కాన్వెంట్‌ స్కూల్లో పాఠశాల విద్యానభ్యసించింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే గుర్తింపు పొందిన టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్శిటీ నుంచి 2016లో మెడిసిన్‌ పూర్తి చేసింది. ఇక సాయి పల్లవి నటిగా కంటే ముందు ఆమ డ్యాన్సర్‌ అనే విషయం తెలిసిందే. మొదట విజయ్ టీవీలో ఉంగలిల్ యార్ అడుత ప్రభుదేవా అనే డాన్స్ రియాలిటీ షోలో పాల్గొంది. ఇక 2009లో ETVలో ఢీ అల్టిమేట్ డ్యాన్స్ షో (D4)లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. అంతకు ముందు సాయి పల్లవి కస్తూరి మాన్ (2005), ధామ్ ధూమ్ (2008)లో వచ్చిన చిత్రాల్లో బాలనటిగా నటించింది. కానీ ఇవి ఆమెకు పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు. కానీ, డ్యాన్స్‌ షోలతో సాయి పల్లవి డన డ్యాన్స్‌ స్కిల్స్‌తో అందరిని ఆకట్టుకుంటుంది. ఈటీవీలో D4 షో టైటిల్‌ గెలిచిన ఆమె ఆ వెంటనే తమిళంలో ప్రేమమ్‌ సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది. తొలి సినిమాకే ఎంతో గుర్తింపు పొందిన ఆమె ఆ వెంటనే తెలుగులో 'ఫిదా' సినిమాలో హీరోయిన్‌గా చాన్స్‌ కొట్టేసింది. ఈ మూవీలో భానుమతి పాత్రలో హీరో పాత్రనే డామినేట్‌ చేసింది సాయి పల్లవి. 

ఫస్ట్‌ మూవీకే సొంతంగా డబ్బింగ్‌

ఫస్ట్‌ సినిమాకే స్వయంగా తెలుగులో డబ్బింగ్‌ చెప్పుకుంది. అదీ కూడా తెలంగాణ యాసలో డైలాగ్స్‌ చెప్పి అదరగొట్టింది. "భానుమతి.. హైబ్రిడ్‌ పిల్లా.. ఒక్కటే పీస్‌" అంటూ కుర్రకారును ఫిదా చేసింది. ఫస్ట్‌ మూవీకే ఎనలేని క్రేజ్‌ సంపాదించుకున్న సాయి పల్లవి ఈ సినిమాకు గానూ ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ అవార్డు కూడా అందుకుంది. ఆ తర్వాత నాని 'మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి', 'పడి పడి లేచే హృదయం', 'విరాట పర్వం' వంటి చిత్రాలతో మంచి హిట్‌ అందుకుంది. ఆ తర్వాత తమిళంలో 'మారి 2'లో నటించింది. ఈ మూవీ కూడా అక్కడ సూపర్‌ హిట్‌. ఇక ఇందులోని రౌడీ బేబీ సాంగ్‌ అయితే యూట్యూబ్‌ని షేక్ చేసింది. ఇక తెలుగులో మరోసారి శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో 'లవ్‌ స్టోరీ' సినిమా చేసింది. ఇందులోనూ తెలంగాణకు చెందిన  విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌కు చెందిన అమ్మాయిగా నటించించి ఆకట్టుకుంటుంది. అక్కినేని హీరో నాగచైతన్యతో జతకట్టి మరో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఆ తర్వాత మరోసారి నానితో 'శ్యామ్‌ సింగరాయ్'‌ సినిమాలో జతకట్టింది. ఇందులో దేవదాసి పాత్రలో నటించిన సాయి పల్లవి తన లుక్‌తో ప్రేక్షకులను కట్టిపారేసింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. సెలక్టివ్‌ రోల్స్‌, సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. 

హ్యాపీ బర్త్‌డే లేడీ పవర్‌ స్టార్‌

అలా నటిగా తమిళంలో, తెలుగు ఫిలింఫేర్, సౌత్‌ ఇండియన్, ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ అందుకుంది. అలాగే 2020లో అత్యంత ఆదరణ పొందిన అండర్‌ 30 సెలబ్రిటీల ఫోర్బ్స్‌ ఇండియా జాబితాలో టాప్‌లో నిలిచింది. అలా గ్లామర్‌ షో దూరంగా ఉంటూ కమర్షియల్‌ హిట్స్‌ అందుకోవడం హీరోయిన్లలో ఒక్క సాయి పల్లవికే సాధ్యం అనడంలో సందేహం లేదు. ఇండస్ట్రీలో తనదైన మార్క్‌తో దూసుకుపోతున్న సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య సరసన తండేల్‌, హిందీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ్‌ చిత్రంలో సీత పాత్రలో నటిస్తుంది. ఢిఫరెంట్‌ యాటిట్యూడ్‌తో ఆకట్టుకుంటున్న సాయి పల్లవి.. ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాపై చేసిన కామెంట్స్‌ అప్పట్లో వివాదస్పదయ్యాయి. అలా తన కామెంట్స్‌తో వివాదంలో నిలిచని ఎక్కడ తగ్గని ఆమ మళ్లీ తనని తాను నిలబెట్టుకుంది. ఇక ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్టైల్‌, యాటిట్యూడ్‌తో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న సాయి పల్లవి కెరీర్‌లో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని, మరెన్నో సక్సెస్‌లు చూడాలని కోరుకుంటూ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. Happy Birthday Sai Pallavi

2024-05-09T00:34:52Z dg43tfdfdgfd