SALAAR 2: ప్రభాస్ లేకుండానే సలార్ 2 షూటింగ్.. రిలీజ్ ఎప్పుడంటే?

సలార్ పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అవ్వడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే వీలైనంత త్వరగా పార్ట్ 2ను రిలీజ్ చేయాలని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భావిస్తున్నారు. అందుకోసమే సలార్ 2 షూటింగ్‌ను ఈ నెలఖారులోనే మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఇప్పటికే ప్రధాన నటీనటులందరి కాల్షీట్లతో సహా షూటింగ్‌కి మొత్తం సిద్ధం చేశారట నీల్. సలార్ 2: శౌర్యాంగ పర్వంలో పార్ట్ 1ను మించిన యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయని టాక్. అందుకోసమే షూటింగ్‌ను త్వరగా మొదలుపెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభాస్ లేకుండానే ఈ షెడ్యూల్ ప్రారంభం కానుండటం కొసమెరుపు.

వారిపై

బాబీ సింహా, జగపతి బాబు, శ్రియా రెడ్డి, శ్రుతి హాసన్‌ సహా ఇతర నటీనటులపై ఈ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. జులైలో జరగబోయే తరువాతి షెడ్యుల్‌లో ప్రభాస్ జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే అక్టోబ‌ర్, న‌వంబ‌ర్ నాటికి సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేయాల‌ని ప్ర‌శాంత్‌ నీల్‌ భావిస్తున్నారు. ఇందుకోసం ఎక్కువ టైమ్ షూట్ చేసి వర్కింగ్ డేస్‌ను కూడా తగ్గించేలా ప్లాన్ చేస్తున్నారట. ఎలాగైనా 4 లేదా 5 నెలల్లో మొత్తం షూటింగ్‌ను కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసినట్లు టాక్.

చిత్రీకరణ పూర్తయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి వీలైనంత త్వరగా 'సలార్- 2' విడుదల చేయాలని భావిస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ లెక్కన ఈ ఏడాది చివరిలో సలార్ 2 రిలీజ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇది పూర్తయిన తర్వాతే ఎన్టీఆర్‌ ప్రాజెక్టుపై ప్రశాంత్ దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇక 'సలార్ 2'పై ఆడియన్స్ అంచనాలను అందుకునేలా క్వాలిటీలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.

కల్కితో బిజీమరోవైపు ప్రభాస్ కల్కి 2898 AD షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. జూన్ 27న ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రానుంది. ఇందుకోసమే షూటింగ్‌ను కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్‌ షురూ చెయ్యాలని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అనుకుంటున్నారు. అందుకే ఈ పనులన్నీ పూర్తయ్యే వరకూ ప్రభాస్‌ ఫ్రీ అయ్యే అవకాశమే లేదు. ఇందుకోసమే కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత జులైలో సలార్ 2 షూటింగ్‌ సెట్‌లో ప్రభాస్ అడుగుపెట్టనున్నారు. అప్పటివరకూ మిగిలిన క్యాస్టింగ్ సీన్లు కంప్లీట్ చేసి నీల్ రెడీగా ఉంటారన్నమాట. ఇక సలార్‌తో పాటు డైరెక్టర్ మారుతీతో చేస్తున్న ది రాజా సాబ్ షూటింగ్ కూడా కంప్లీట్ చేయబోతున్నారు ప్రభాస్. ఈ రెండు పూర్తయిన తర్వాతే సందీప్ రెడ్డి వంగా సినిమా స్పిరిట్‌ మొదలుకానుంది. ఎలా లేదన్నా ఈ ఏడాది చివరిలో స్పిరిట్ షూటింగ్‌ కూడా షురూ కానుంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-04T05:17:38Z dg43tfdfdgfd