SALAAR: ఇలా చేస్తే చాలు.. సలార్ లోని ప్రభాస్ బైక్ ఇక మీ సొంతం

Prabhas Bike: బాహుబలి తరువాత వరుస ప్లాపులతో సతమతమవుతున్న హీరో ప్రభాస్ కి సలార్ సినిమా మంచి విజయం అందించి పెట్టింది. కే జి ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రభాస్ ని ఊర మాస్ అవతార్లో చూపించి ఆయన అభిమానుల దగ్గర నుంచి ప్రశంసలు అందుకుంది. సాధారణ ప్రేక్షకులు సైతం ఈ చిత్రానికి ఫిదా అయ్యారు.

ప్రభాస్ , పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హసన్ కీలక పాత్రలు పోషించిన  సలార్ సినిమా తొలి భాగం ‘సలార్- సీజ్ ఫైర్’తెలుగు భాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రం రెండో భాగం కోసం ప్రస్తుతం మూవీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

హై యాక్షన్ వోల్తేజ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో ప్రభాస్ యాక్టింగ్, దర్శకుడు సినిమాని తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఖాన్సర్ అనే ఒక ప్రదేశాన్ని సృష్టించి ఆ ప్రదేశంలో జరిగే సంఘటనలను ఎంతో చక్కగా తెరకెక్కించారు డైరెక్టర్. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ నరిపే బైక్ కూడా ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎంతో స్టైలిష్ గా ఉండే ఈ బైక్ గురించి అప్పట్లో ఎంతో మంది గూగుల్లో కూడా సర్చ్ చేశారు. అయితే ఇప్పుడు ఆ బైక్ ని సొంతం చేసుకునే అవకాసం కల్పిస్తోంది సలార్ సినిమా యూనిట్. మీకూ ఆ బైక్‌ అంటే ఇష్టమా? మీరు ఆ బైక్ ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఏం చేయాలో తెలుసుకోవాలంటే ఒకసారి ఇది చదివేయండి.

ఈ చిత్రం ఏప్రిల్ 21న మాటీవీలో డిజిటల్ ప్రీమియర్ కి సొంతమవుతుండగా ఈ చిత్రం ఫ్యాన్స్‌ కోసం మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో గివ్‌ అవే క్యాంపెయిన్‌ స్టార్ట్‌ చేశారు. ప్రభాస్ ఐకానిక్ మోటార్‌సైకిల్‌ను ఒక లక్కీ విన్నర్‌కు అందజేయనున్నారు అని ఈ సందర్భంగా తెలిపాడు. దీనికి సంబంధించి ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిల్మ్స్, గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ కూడా వేసింది. ప్రభాస్ బైక్ నడుపుతున్న పోస్టర్‌ను షేర్ చేసి, క్యాప్షన్‌లో గివ్‌ అవే డీటైల్స్‌ పేర్కొంది.

హోంబలే ఫిల్మ్స్ ఇన్‌స్టా పోస్టులో "SalaarCeaseFireలో రెబెల్ స్టార్ ప్రభాస్ నడిపిన అదే ఐకానిక్ బైక్‌ను గెలుచుకోవడానికి మీకో సూపర్ ఆఫర్. మీరు చేయాల్సిందల్లా, ఏప్రిల్‌ 21న 5:30 PM నుంచి 8 PM వరకు స్టార్‌ మా లో  ప్రచారమయ్యే సలార్‌ మూవీటైమ్‌లో స్క్రీన్ ఎడమ వైపున బైక్ ఇమేజ్‌ ఎన్నిసార్లు కనిపించిందో లెక్కించాలి. లెక్కించిన తరువాత, SMS లైన్స్‌ ఓపెన్‌ అయినప్పుడు, SALAAR టైప్‌ చేసి 9222211199కి SMS పంపండి. 2024 ఏప్రిల్ 21న రాత్రి 8 గంటల నుంచి SMS లైన్ష్‌ ఓపెన్‌ అవుతాయి" అని వివరించింది.

 

కాబట్టి ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం మాటీవీలో ప్రసారమయ్యే సలార్ సినిమా చూస్తూ ఈ పని చేస్తే చాలు.. ప్రభాస్ బైక్ మీ సొంతం..

Read More: Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?

Read More: Sai Pallavi Dance: షీలా.. షీలా కి జవానీ పాటకు మెస్మరైజింగ్ స్టెప్పులు వేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

2024-04-19T14:43:32Z dg43tfdfdgfd