SAM PITRODA: దక్షిణాది వాళ్లంతా ఆఫ్రికన్స్‌లా ఉంటారు, మరోసారి శ్యాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు

Sam Pitroda Controversy: కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ శ్యాం పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో తూర్పు రాష్ట్రాల్లో ఉన్న వాళ్లంతా చైనా వాళ్లలాగే కనిపిస్తారని నోరు జారారు. అంతే కాదు. దక్షిణాది రాష్ట్రాల వాళ్లంతా ఆఫ్రికన్స్‌లా ఉంటారంటూ కామెంట్ చేశారు. ఇప్పటికే వారసత్వ పన్ను గురించి ప్రస్తావించి విమర్శలు ఎదుర్కొన్న శ్యాం పిట్రోడా ఇప్పుడీ వ్యాఖ్యలతో మరోసారి అందరికీ టార్గెట్ అయ్యారు. The Statesman కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడారు. భారత దేశ ప్రజస్వామ్యం గురించి ప్రస్తావిస్తూ..తమ దేశంలో ఎంతో వైవిధ్యం కనిపిస్తుందని చెప్పారు. ఆ సమయంలోనే తూర్పు, దక్షిణాది రాష్ట్రాల పౌరులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. మన దేశం గురించి కొంతైనా తెలుసుకోండి అంటూ మండి పడ్డారు. 

"భారత్‌లో ఎంతో వైవిధ్యం ఉంది. 75 ఏళ్లుగా దేశం ఎంతో సంతోషకరమైన వాతావరణంలో ముందుకు నడుస్తూ వచ్చింది. గొడవలన్నీ మరిచిపోయి అంతా ఆనందంగా బతుకుతున్నారు. ఇక్కడి వైవిధ్యం చాలా గొప్పది. తూర్పు రాష్ట్రాల పౌరులు చైనా వాళ్లలాగే ఉంటారు. ఇక పశ్చిమ రాష్ట్రాల వాళ్లు అరబ్‌లుగా, ఉత్తరాది పౌరులు తెల్లవాళ్లుగా, దక్షిణాది వాళ్లంతా ఆఫ్రికన్స్‌లా కనిపిస్తారు. అయినా మేమంతా సొంత అన్నదమ్ముల్లా ఉంటాం 

- శ్యాం పిట్రోడా, కాంగ్రెస్ నేత 

అయితే...శ్యాం పిట్రోడా వ్యాఖ్యలతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్రంగా స్పందించారు. ఆయన అభిప్రాయాల్ని ఖండిస్తున్నట్టు వెల్లడించారు. 

"శ్యాం పిట్రోడా భారత దేశ ప్రజల గురించి చేసిన వ్యాఖ్యలు అసలు ఆమోదయోగ్యమైనవి కావు. పార్టీతో ఈ కామెంట్స్‌కి ఎలాంటి సంబంధం లేదు"

- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత 

 

బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ కూడా శ్యాం పిట్రోడా వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. జాతి వివక్ష అంటూ మండి పడ్డారు. రాహుల్ గాంధీకి గురువైన శ్యాం పిట్రోడా భారతీయుల గురించి ఇలా మాట్లాడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. భారతీయులను పట్టుకుని ఇలా చైనీయులు, సౌతాఫ్రికన్లు అంటూ వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించారు. ఇది సిగ్గుచేటు అని మండి పడ్డారు.

Also Read: Fact Check: హిందూ భార్యని వేధించిన ముస్లిం భర్త అంటూ వీడియో వైరల్, అసలు విషయమేంటంటే?

2024-05-08T09:43:34Z dg43tfdfdgfd