SAMYUKTHA MENON: టాలీవుడ్లో అది చిరాకేస్తుంది.. కానీ, మలయాళంలో నేచురల్గా ఉంటుంది

Samyuktha Menon: టాలీవుడ్లో అది చిరాకేస్తుంది.. కానీ, మలయాళంలో నేచురల్గా ఉంటుంది

మలయాళ హీరోయిన్ సంయుక్త మీనన్(Samyuktha Menon) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తరువాత వచ్చిన బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమా విజయం తరువాత వరుస అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీ.. విరూపాక్ష, డెవిల్ వంటి సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం నిఖిల్ హీరోగా వస్తున్న స్వయంభూ సినిమా చేస్తున్న సంయుక్త.. శర్వానంద్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సినిమాలు చేస్తోంది. 

ఇదిలా ఉంటే.. తాజాగా సంయుక్త టాలీవుడ్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ.. మలయాళం సినిమాతో పోలిస్తే తెలుగులో నటించడం చాలా కష్టం. దానికి.. భాష అనేది మొదటి కారణమైతే.. మేకప్ రెండో కారణం. వినడానికి సిల్లీగా ఉండొచ్చు కానీ, నాకు ఇది చాలా పెద్ద విషయం. మలయాళ ఇండస్ట్రీలో మేకప్ వేయడం చాలా త్వరగా అయిపోతుంది, నేచురల్‌గా ఉంటుంది. యాక్టింగ్ కూడా మనకు నచ్చినట్లు చేయొచ్చు.

కానీ, టాలీవుడ్‌లో అలా ఉండదు. ఇక్కడ ప్రతీదానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఎలా ఉన్నాం, స్క్రీన్‌పై ఎలా కనిపిస్తున్నామనేది ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఇక మేకప్ కూడా చాలా వేస్తారు. మొహంపై ఎదో ఉన్నట్లు చిరాగ్గా ఉంటుంది.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది సంయుక్త. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

©️ VIL Media Pvt Ltd.

2024-05-10T09:51:35Z dg43tfdfdgfd