SANDEEP KISHAN: చిన్న హీరో పై భారీ బడ్జెట్.. మరోసారి పెద్ద రిస్క్ చేయనున్న ఏజెంట్ నిర్మాత

Sundeep Kishan high budget movie : ఈమధ్య ప్యాన్ ఇండియా సినిమాలు ఎక్కువైన సంగతి తెలిసిందే. చాలామంది నిర్మాతలు ప్యాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు తీస్తూ భారీ బడ్జెట్లు వెచ్చిస్తున్నారు. కానీ హీరోకి క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఎక్కువగా లేకపోతే నిర్మాతలు కూడా పెద్దగా రిస్క్ చేయరు. హీరో మార్కెట్ ను బట్టే సినిమా బడ్జెట్ అని.. కొందరు నిర్మాతలు చెబుతారు.

అనిల్ సుంకర మాత్రం ఈ కోవకి చెందేలాగా కనిపించడం లేదు. సబ్జెక్ట్ మీద మాత్రమే నమ్మకం పెట్టుకొని.. ఇంక ఏ విషయాలు పట్టించుకోకుండా కోట్లు కోట్లు కుమ్మరించేస్తూ ఉంటారు. శర్వానంద్, సిద్ధార్థ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం సినిమా విషయంలో కూడా బోలెడంత బడ్జెట్ పెట్టారు అనిల్ సుంకర. ఇక అఖిల్ ఏజెంట్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ రెండు సినిమాలలో కథ కూడా పెద్దగా లేకపోవడం. ఈ రెండు చిత్రాల కథ వింటేనే ఈ సినిమాలలో కంటెంట్ ఏమీ లేదు అని అర్థమవుతుంది. మరి స్టార్ పవర్ లేకుండా.. అలా అని కంటెంట్ కూడా లేకుండా.. ఈ రెండు చిత్రాలపై అనిల్ ఎందుకు అంత బడ్జెట్ పెట్టారు అనేది ఎంతో మందికి ఉండే అనుమానం.

ఈ క్రమంలో తాజాగా ఇప్పుడు అనిల్ సుంకర మళ్ళీ అలాంటి రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నారు. అనిల్ సుంకర నిర్మాతగా రాజేష్ దండ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన భైరవకోన సినిమా హిట్ అవ్వడంతో.. మళ్లీ సందీప్ కిషన్ తో మరొక సినిమా మొదలుపెట్టారు. దాదాపు సగానికిపైగా సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. 

ఈ సినిమా కోసం అనిల్ సుంకర ఏకంగా పాతిక కోట్ల బడ్జెట్ పెడుతున్నారట. ఈ మాట విన్న అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. భైరవకోన సినిమా థియేటర్ల నుంచి బాగానే వసూళ్లు అందుకుంది. ఇక ఆ నమ్మకంతో ఇప్పుడు అనిల్ సుంకర ఇలాంటి రిస్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ భైరవకోన ఒక హారర్ ఫాంటసీ సినిమా.. విజువల్ వర్క్ కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి.. బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే నెట్టుకొచ్చింది.

అయితే ఆ సినిమా కూడా పెద్దగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయితే సాధించలేదు. కేవలం కొన్ని దగ్గర్లో బ్రేక్ ఈవెన్ మాత్రం సాధించింది. ఇంతలో మాత్రానికి అనిల్..సందీప్ కిషన్ పై అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఏముంది అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. పైగా సందీప్ కిషన్ మార్కెట్ కూడా అంతంత మాత్రమే ఉన్న ఈ సమయంలో అనిల్ సుంకర పాతిక కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీయడం.. అంటే నిజంగా నమ్మలేని విషయం అని మరి కొందరు అంటున్నారు. మరి ఈసారైనా.. కంటెంట్ చూసుకొని.. అనిల్ డబ్బులు పెట్టారా లేదా అనేది తెలియాలి అంటే సినిమా విడుదల వరకు వేచి చూడాలి..

Also Read: Noise Watch: రూ.4,999ల Noise Icon వాచ్‌ ఇప్పుడు కేవలం రూ.949కే పొందండి.. పూర్తి వివరాలు ఇవే!

Also Read: Rashmi Gautam: ట్రోలర్ కి రష్మీ షాకింగ్ రిప్లై.. రేపు నీ పిల్లలని చంపుతాడు జాగ్రత్త

   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-05-08T15:14:24Z dg43tfdfdgfd