SARATHI STUDIOS - KEERAVANI: కీరవాణి చేతులు మీదుగా అధునాతన హంగులతో ప్రారంభమైన సారథి స్టూడియోస్..

Sarathi Studios - Keeravani: హైదరాబాద్‌లో ఇపుడు రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్, రామకృష్ణ స్టూడియోస్, పద్మాలయా వంటివి కంటే ముందు భాగ్యనగరంలో కొలువైన తొలి స్టూడియో శ్రీ సారథి స్టూడియోస్‌కు ప్రత్యక గుర్తింపు వుంది. ఒకనాటి క్లాసిక్ మూవీస్ నుంచి మొదలు పెడితే.. ఎన్నో సినిమాల షూటింగ్స్ ఇక్కడ జరుపుకున్నవే. తాజాగా ట్రెండ్‌కు తగ్గట్టు సారథి  స్టూడియోస్‌ను అధునాతన హంగులతో తీర్చిదిద్దారు. తెలుగు రాష్ట్రాల్లోనే

అధునాతన డాల్బీ మిక్సింగ్,  సౌండ్ డిజైన్ స్టూడియోలను శ్రీ సారథీ స్టూడియోస్‌ను ఆస్కార్ అవార్డు విజేత కీరవాణి చేతుల మీదుగా పునః ప్రారంభమైంది. మరోవైపు సౌండ్ డిజైన్ స్టూడియోను సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీ సారథీ స్టూడియోస్ చైర్మన్ ఎం.ఎస్ ఆర్.వి. ప్రసాద్ మాట్లాడుతూ..

ముంఉగా  ఈ స్టూడియోని కూలగొట్టి మల్టీఫ్లెక్స్ థియేటర్స్ గా మార్చాలన్న ఆలోచన వచ్చింది. ఆ తర్వాత విరమించుకున్నాం. సినీ స్టూడియోస్ గానే  కొనసాగించాలని నిర్ణయించుకున్నాము. ఆ తర్వాత షూటింగులకు కావలసిన అన్ని రకాల హంగులు, అలాగే నేటి కాలానికి పోటీపడేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్స్ కు కావలసిన అధునాతన టెక్నాలజీని మా స్టూడియోలో అందుబాటులోకి తీసుకొచ్చాము.  మేము ఈ రోజు ఆరంభించిన డాల్బీ మిక్సింగ్,  సౌండ్ డిజైన్ లు చాలా చాలా అధునాతనమైనవి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ  మా స్టూడియోలో మొదలైన ఫస్ట్ మూవీ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ సినిమా 'కల్కి' కావడం ఆనందంగా ఉందన్నారు.  

శ్రీ సారథీ స్టూడియోస్ డైరెక్టర్ కె.వి.రావు మాట్లాడుతూ..

మా స్టూడియోలో షూటింగ్ ప్రారంభిస్తే,, పోస్ట్ ప్రొడక్షన్స్ తో సహా సినిమా మొదటి కాపీని సిద్ధం చేసుకునేంతవరకు కావలసిన ఎక్విప్ మెంట్ అంతా రెడీ ఉందన్నారు. సినిమా అనగానే  సౌండింగ్ కు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. అందుకే అధునాతన టెక్నాలజీని మేము ప్రవేశపెట్టామన్నారు.

 

ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు కె.ఎస్.రామారావు, కె.ఎల్.నారాయణ, రచయిత విజయేంద్రప్రసాద్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, సంగీత దర్శకుడు భీమ్స్, స్టూడియో జనరల్ మేనేజర్ బాలచంద్ర, ఇంకా పలువురు సినీ ప్రముఖులు, మీడియా ప్రముఖులు పాల్గొని, శ్రీ సారథి స్టూడియో యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు.

Also Read: Hyderabad Weather Report: హైదరాబాద్‌ నగరంలో భానుడి ఉగ్రరూపం.. ఈ ఆరు ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఎండలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-04-27T02:52:15Z dg43tfdfdgfd