SHATRUGHAN SINHA | సోనాక్షి సిన్హా వివాహంపై మౌనం వీడిన శత్రుఘ్న సిన్హా

Shatrughan Sinha : తన కూతురు, నటి సోనాక్షి సిన్హా వివాహంపై ఎట్టకేలకు శత్రుఘ్న సిన్హా పెదవివిప్పారు. సోనాక్షి ఈనెల 23న ముంబైలో జహీర్‌ ఇక్బాల్‌ను వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. తన కూతురి వివాహ ప్రణాళికలపై తాను ఎవరితోనూ మాట్లాడలేదని శత్రుఘ్న సిన్హా చెప్పారు.

వారి వివాహం గురించి తమకు ఎప్పుడు నవ జంట తెలియచేసినా తాను తన భార్య వారిని ఆశీర్వదిస్తామని అన్నారు. సోనాక్షి, జహీర్‌ వివాహం గురించి తనకు తెలియదని అన్నారు. తానూ మీడియాలో వచ్చిన వార్తలతోనే ఈ విషయం తెలుసుకున్నానని చెప్పారు.

ఆమె సంతోషంగా ఉండాలనే తాము ఎప్పుడూ కోరుకుంటామని స్పష్టం చేశారు. సోనాక్షి తన నిర్ణయాలను తాను సొంతంగా తీసుకునే హక్కు కలిగిఉందని చెప్పారు. ఆమె నిర్ణయాల పట్ల తాము నమ్మకంతో ఉంటామని, ఆమె ఎప్పుడూ తప్పుడు నిర్ణయం తీసుకోదని అన్నారు.

Read More :

Vikarabad Forest | వీఎల్‌ఎఫ్ రాడార్‌తో వికారాబాద్‌ అడవికి ముప్పు

2024-06-11T08:30:24Z dg43tfdfdgfd