SHIRIDI TOUR: షిరిడీ ఎల్లోరా వెళ్లొస్తారా? 2 రోజుల టూర్ రూ.3100 మాత్రమే

వేసవి సెలవుల్లో షిరిడీ వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. అతి తక్కువ ధరకే షిరిడీ ఎల్లోరా టూర్ ప్యాకేజీ అందిస్తోంది తెలంగాణ టూరిజం. రెండు రోజుల టూర్‌ను కేవలం రూ.3100 ధరకే అందిస్తోంది తెలంగాణ టూరిజం. ఈ టూర్ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో శనిశిగ్నాపూర్, షిరిడీ, ఎల్లోరా, గ్రుహనేశ్వర్, ఔరంగాబాద్ మినీ తాజ్ మహల్ కవర్ అవుతాయి. ఇది 3 రోజులు, 4 రాత్రుల టూర్ ప్యాకేజీ. ప్రతీ బుధవారం, శుక్రవారం షిరిడీ, ఎల్లోరా టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ఎలా సాగుతుందో తెలుసుకోండి.

తెలంగాణ టూరిజం షిరిడీ, ఎల్లోరా టూర్ మొదటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్, బషీర్‌బాగ్, ప్యారడైజ్ సర్కిల్, బేగంపేట్, కేపీహెచ్‌బీ, చందానగర్‌లో టూరిస్ట్ బస్ ఎక్కొచ్చు. రెండో రోజు ఉదయం శనిశిగ్నాపూర్ ఆలయ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత షిరిడీ బయల్దేరాలి.

Tirupati Tour: జస్ట్ ఒక్క రోజులో తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకొని వచ్చేయొచ్చు... టూర్ ప్యాకేజీ వివరాలివే

రెండో రోజు సాయంత్రం షిరిడీలో సొంత ఖర్చులతో సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవాలి. రాత్రికి షిరిడీలోనే బస చేయాలి. మూడో రోజు ఉదయం షిరిడీ నుంచి బయల్దేరాలి. ఎల్లోరా గుహలు, ఔరంగాబాద్‌లో మినీ తాజ్‌మహల్ చూడొచ్చు. ఆ తర్వాత తిరుగుప్రయాణం ప్రారంభం అవుతుంది. నాలుగో రోజు ఉదయం హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

Money Plant: మీ ఇంట్లో మనీ ప్లాంట్ లేదా? ఈ విషయం తెలిస్తే ఇల్లంతా మొక్కలతో నింపేస్తారు

తెలంగాణ టూరిజం షిరిడీ, ఎల్లోరా టూర్ ప్యాకేజీ ధర చూస్తే ఏసీ కోచ్‌లో పెద్దలకు రూ.3,550, పిల్లలకు రూ.2,890, నాన్ ఏసీ కోచ్‌లో పెద్దలకు రూ.3,100, పిల్లలకు రూ.2,530 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో బస్సు ప్రయాణం, సైట్ సీయింగ్ మాత్రమే కవర్ అవుతాయి. దర్శనం, భోజనం టూర్ ప్యాకేజీలో కవర్ కావు. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://tourism.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

2024-05-02T12:15:37Z dg43tfdfdgfd