SIDHU JONNALAGADDA: టిల్లు స్క్వేర్ రిలీజ్ అయ్యాక..సిద్దు బాయ్ రేంజ్ మారబోతుందా!

Sidhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ రిలీజ్ అయ్యాక..సిద్దు బాయ్ రేంజ్ మారబోతుందా!

సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) కెరీర్ సినిమా సినిమాకు తనలోని టాలెంట్ ని బయటకు తీసుకొస్తూ ఉన్నాడు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకున్నా..చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్ స్టార్ట్ చేసి ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ఇక ఆతర్వాత తానే రైటర్ గా మారి కృష్ణ అండ్ హిజ్ లీలాతో గ్రాండ్ హిట్ కొట్టాడు. ఇక ఆ సినిమా నుంచి వెనుక్కి తిరిగి చూసుకోకుండా మా వింత గాథ వినుమా, డిజె టిల్లు.. ఇప్పుడు టిల్లు స్క్వేర్ వంటి వెరైటీ కాన్సెప్ట్స్‌‌‌‌తో టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు హీరో  సిద్ధు జొన్నలగడ్డ. 

ఇదిలా వుంటే..సిద్దు కెరీర్లో డిజె టిల్లు లాంటి సాలిడ్ హిట్ పడడం..యూత్లో తన వెరైటీ స్లాంగ్ తో ఇచ్చిపడేసే యాక్టర్ అంటే..సిద్దు అని చెప్పుకోవాల్సిందే. డిజె టిల్లు మూవీలోని రాజా రాజా ఐటమ్ రాజా సాంగ్ తో పాటు డిజె టిల్లు వంటి సాంగ్స్ తో యూత్లో మంచి ర్యాపో క్రియేట్ చేసుకున్నాడు.అసలు విషయానికి వస్తే..ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సినిమా రేపు మార్చి 29న థియేటర్లో రిలీజ్ కానుంది. 

మల్లిక్ రామ్ (MallikRam) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. సాంగ్స్, పోస్టర్స్, టీజర్ ఇలా ప్రతిఒక్కటీ ఇంట్రెస్ట్ పెంచుతూ వస్తున్నాయి. అంతేకాకుండా సిద్దు,అనుపమ రొమాన్స్ పీక్స్ లో ఉండటంతో యూత్ వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఎలక్ట్రిఫైయింగ్ టిల్లు స్క్వేర్ లో ఈ టిల్లు గాడి యాక్టింగ్..డబుల్ టైం పిచ్చెకించే విధంగా..డబుల్ టైం నవ్వుకునే విధంగా ఆకట్టుకుంటున్నాడు.

సిద్ధు జొన్నలగడ్డ స్టైల్, డైలాగ్ డెలివరీ స్వాగ్, హీరోయిన్స్ తో రొమాన్స్ అన్నిటికీ అన్ని వావ్ అనేలా ఉన్నాయి. ఈ సినిమా బజ్ చూస్తుంటే కచ్చితంగా టిల్లు స్క్వేర్ సరికొత్త సెన్సేషన్గా మారే అవకాశాలు ఉన్నాయని టాక్ మొదలైంది. దీంతో ఈ సినిమాకు వచ్చే ఫస్ట్ టాక్ తోనే..సిద్ధు రేంజ్ అంతకంత పెరిగే ఛాన్స్ ఉందని సినీ సర్కిల్ లో వినిపిస్తోంది. 

వన్స్ టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ అయితే..తన డిమాండ్ కూడా మరో లెవెల్లో ఉండబోతున్నట్లు సమాచారం.చిన్న హీరోగా ఇండిస్టీ కి వచ్చి..ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోస్ కు సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటాడనే టాక్ కూడా మొదలైంది.

అలా చూసుకుంటే.. ప్రసెంట్ సిద్దు చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులు వున్నాయి. ఈ రెండు ప్రాజెక్ట్ లకు పది కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని కూడా తెలుస్తోంది. మరి టిల్లు స్క్వేర్ రిలీజ్ అయ్యాక..ఎలా ఉంటుందో చూడాలి.

©️ VIL Media Pvt Ltd.

2024-03-28T10:41:41Z dg43tfdfdgfd