SIMHACHALAM: సింహాచలంలో శ్రీ సుదర్శన నరసింహ మహా యజ్ఞం

విశాఖ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సుదర్శన మహా యాగం జరుగుతుంది. ఈనెల 26న మొదలైంది. ఏప్రిల్ ఒకటి దాకా ఈ యాగం జరుగుతుందని ఈవో తెలిపారు. ఈ యాగంలో రెండో రోజు ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు. యాగంలో ప్రత్యేకంగా పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో శ్రీసుదర్శన నారసింహ మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. మార్చి 26న ఫాల్గుణ బహుళ విదియ రోజున మొదలైన ఈ మహా యజ్ఞం ఏప్రిల్ 1 సప్తమి వరకు జరుగుతుంది. వేద పండితుల ఆధ్వర్యంలో ఈ మహాయజ్ఞం జరగనుంది. ఈ క్రతువును ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆలయ అధికారులు.. నిర్వహణ చాలా బాగా చేస్తూ వచ్చారు. ఆలయ ఉత్తర గోపురం ఎదురుగా ఉన్న కళ్యాణోత్సవం ప్రాంగణంలో యాగశాల నిర్మాణం చేసి.. సర్వాంగ సుందరంగా చేస్తున్నారు. యాగశాల నిర్మాణం, హోమగుండాల ఏర్పాటు, భక్తులు కూర్చునేందుకు సౌకర్యాలు, తాగునీరు, ఇతర వసతులు అన్నీ కల్పించారు.

Tirupati Tour: జస్ట్ రూ.3,500 కే తిరుపతి టూర్ ప్యాకేజీ... తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, బస ఉచితం

సింహాచలం ఈవో సింగల శ్రీనివాసమూర్తి యాగాన్ని ఏడురోజుల పాటు నిర్వహించి ప్రత్యేకంగా రూపొందించిన చివరి రోజు కార్యక్రమంతో పూర్తి చేస్తామన్నారు. ఏడు రోజుల పాటు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే యాగంలో భక్తులు పాల్గొనేందుకు అవకాశం ఉందన్నారు. అందుకు భక్తులు రూ.3 వేలు చెల్లించి ప్రత్యక్ష, పరోక్ష విధానంలో పాల్గొనవచ్చని చెప్పారు. యజ్ఞంలో పాల్గొనే భక్తులకు ఉదయం అల్పాహారం చేస్తున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక అన్నప్రసాదం ఉంటుంది. అంతరాలయంలో ప్రత్యేక దర్శనం కల్పిస్తామని, ఉభయదాతలతో పాటు మరో ఇద్దరికి ఈ సదుపాయాలు అందుతాయని పేర్కొన్నారు. యజ్ఞంలో పాల్గొనేవారికి శాలువ, రవిక, కళ్యాణం లడ్డు, అరకిలో పులిహోర ప్రసాదం, స్వామివారి రాగి ప్రతిమ అందజేస్తారు.

---- Polls module would be displayed here ----

కాగా, బుధవారం జరిగిన యజ్ఞంలో ఆలయ అనువంశిక ధర్మకర్త అశోకగజపతిరాజు ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, ఆలయ ఈవో, ఆలయ యంత్రాంగం ఆయనకి సాదర స్వాగతం పలికింది. అలాగే వేద పండితులు ఆశీర్వచనం తర్వాత ఆయన యజ్ఞంలో పాల్గొన్నారు. వరాహ లక్ష్మీ నరసింహస్వామ కృప అందరికీ ఉండాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అశోకగజపతి రాజు ఆకాంక్షించారు. ఇలాంటి యాగాలు మరిన్ని జరగాలని ఆయన ఆలయ అర్చకులను కోరారు.

Tirumala Alert: ఏప్రిల్‌లో తిరుమల వెళ్తున్నారా? ఈ తేదీలు గుర్తుంచుకొని దర్శనం ప్లాన్ చేసుకోండి

ఇక పరోక్ష సేవలో పాల్గొనే భక్తులకు యూట్యూబ్‌ ద్వారా వీక్షించే సదుపాయంతో పాటు ప్రసాదం, రాగి ప్రతిమ తపాలా ద్వారా పంపిస్తారు. మహాయజ్ఞంలో పాల్గొనాలనుకునే భక్తులు సింహగిరితోపాటు కొండ దిగువన శ్రీదేవి కాంప్లెక్సు ఆలయంలో కౌంటర్ల ద్వారా రూ.3 వేలు చెల్లించి టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ద్వారా ఆలయ అధికారిక వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లు పొందవచ్చు. ఈ టికెట్లకు సంబంధించిన వివరాలను 63038 00739 నెంబర్‌కు వాట్సాప్‌ ద్వారా సమాచారాన్ని దేవస్థానానికి అందజేయాలి. దూర ప్రాంతాల నుంచి యజ్ఞానికి వచ్చే భక్తులకు వసతి సదుపాయం కూడా దేవస్థానం సమకూర్చుతుంది.

2024-03-28T06:28:27Z dg43tfdfdgfd