SIVAM MEDIA: శివమల్లాల నిర్మాతగా తెలుగులో నూతన నిర్మాణ సంస్థ శివమ్‌ మీడియా ప్రారంభం..

Sivam Media: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎపుడు పాత నీరు పోయి కొత్త నీరు వస్తూనే ఉంటుంది. ఈ కోవలో టాలీవుడ్‌లో మరో కొత్త నూతన నిర్మాణ సంస్థ  ‘శివమ్‌ మీడియా’ పేరుతో కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభం అయ్యింది. సీనియర్‌ ర్నలిస్ట్‌ శివమల్లాల ఈ బ్యానర్‌ నిర్మాత. గురువారం ఈ సినిమా శివమ్‌ మీడియా లోగో మరియు బ్యానర్‌ను ప్రముఖ నటులు అలీ నిర్మాత, దర్శకులు  ప్రవీణా కడియాల , అనిల్‌ కడియాల బ్యానర్ లోగోను ఆవిష్కరించారు.  

ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ–‘‘ శివ నా తమ్ముడు లాంటివాడు. గత 20 ఏళ్లుగా ఆయనతో నాకు వ్యక్తిగతంగా మంచి సన్నిహితుడు మరియు మిత్రుడు. చిన్న స్థాయి నుండి కెరీర్‌ను ప్రారంభించి ఈ రోజున నిర్మాతగా తన బ్యానర్‌ను స్థాపించి ముందుకు వెళ్లటం సంతోషించదగ్గ పరిణామం.  

అనిల్‌ కడియాల మాట్లాడుతూ– శివమల్లాల కెరీర్ స్టార్ట్ నుంచి మాకు మంచి స్నేహితుడు. స్నేహశీలి మంచి మనిషి. అందుకే మా జర్నీలో శివ ఎపుడు ఉన్నాడు. ఈ రోజు ‘శివమ్‌ మీడియా’ అనే బ్యానర్‌ ద్వారా శివ అనేక సినిమాలు తీసి మంచి విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాత ప్రవీణా కడియాల మాట్లాడుతూ– ‘‘ ఈ రోజు నాకు ఎంతో హ్యాపీగా ఉంది. మా ముందు చిన్న రిపోర్టర్‌గా  పిఆర్వోగా పనిచేసిన మా శివాయేనా ఒక బ్యానర్‌ని పెట్టింది అనిపిస్తుంది. ‘శివమ్‌ మీడియా’ విషయంలో నేను ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. ఈ బ్యానర్‌ద్వారా డబ్బింగ్‌ సినిమానా, స్ట్రెయిట్‌ సినిమానా  అనే తేడా లేకుండా అనేక మంచి సినిమాలు వస్తాయని కోరకుంటున్నాను. ఈ బ్యానర్ తెలుగులో ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

శివమ్‌ మీడియా నిర్మాత శివమల్లాల మాట్లాడుతూ–నాకు కెరీర్ తొలినాళ్ల నుంచి నాకు ఎప్పుడు అండగా నిలిచిన ముగ్గురు మిత్రులు అలీ, అనిల్, ప్రవీణా. ఈ ముగ్గురు చేతుల మీదుగా నా బ్యానర్‌ని స్టార్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నేను ఎంత కష్టపడతానో ఈ ముగ్గురికి బాగా తెలుసు. శివమ్‌ మీడియా బ్యానర్‌పై  మంచి సినిమాలు చేస్తాను.

నటీననటులు– సాంకేతిక నిపుణులు

 హీరో– హమరేశ్, హీరోయిన్‌ – ప్రార్థన సందీప్, ఆడుగాలం మురుగదాస్, మాటలు– కె.యన్‌ విజయ్‌ పాటలు– రాంబాబు గోసాల, సంగీతం– సుందరమూర్తి కె.యస్‌ డిఓపి– బ్యానర్‌– శివమ్‌ మీడియా నిర్మాత– శివమల్లాల, కథ– దర్శకత్వం– వాలీ మోహన్‌దాస్‌ ,పీఆర్‌వో– మధు వి.ఆర్, మూర్తి మల్లాల

Also Read: Egg Murder: 'కోడిగుడ్డు'తో చనిపోయిన మహిళ.. ప్రేమ వ్యవహారమే కారణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2024-03-28T17:04:56Z dg43tfdfdgfd