SNAKE: పిల్లపామే కదా అని నోట్లో వేసుకున్నాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా.?.. వీడియో వైరల్..

Young man beaten by baby snake while putting his mouth: చాలా మంది పాములంటే చచ్చేంత భయంతో ఉంటారు. వీటి జోలికి అస్సలు పోకూడదని భావిస్తారు. కానీ కొన్నిసార్లు అనుకోకుండా పాముల బారినపడుతుంటారు. పాములు దట్టమైన అడవులు, చెట్ల పొదలు, కొండలు ఉన్న ప్రాంతంలో ఎక్కువగా కన్పిస్తాయి. కొందరు పాములు కన్పిస్తే అత్యుత్సాహం చూపిస్తుంటారు. వాటిని తాకడం, మెడలో వేసుకొవడం, ముద్దులు పెట్టడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి పనుల వల్ల.. కొన్నిసార్లు అనుకోని ఘటనలు జరుగుతుంటాయి.

 

సోషల్ మీడియాలో పాముల కంటెంట్ ఉన్న వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. నెటిజన్ లు కూడా వీటిని ఎక్కువగా చూడటానికి ఆసక్తిచూపిస్తుంటారు. వీటిలో కొన్ని భయంకరంగాను,మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేసేవిలా ఉంటాయి. కొందరు పాముల్ని పట్టుకుని షాంపుతో స్నానంచేయిస్తుంటారు.మరికొందరు తమ బెడ్ రూమ్ లో పరుపు మీద వేసుకుంటారు. ఇంకొందరు పాముల్నిపట్టుకుని, వాటితో ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ఘటనలు గతంలో అనేకం జరిగాయి. కొన్నిసార్లు పాములు కాటేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అచ్చం ఈ కోవకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

పూర్తి వివరాలు..

పాములను చూస్తేనే భయంకరంగా ఉంటాయి. పొరపాటున కాటే వేశాయో.. ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. టైమ్ కు మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్లి యాంటి వెనమ్ తీసుకొకుంటే అంతే సంగతులు. ఈ క్రమంలో ఒక యువకుడుచేసిన పిచ్చిపని ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ గా మారింది. సదరు యువకుడు అడవిలో పర్యటిస్తుండగా.. అతడికి గ్రీన్ రంగులో ఉన్న సన్నని  పాము కనిపిస్తుంది. దాన్ని చేతిలోకి తీసుకుని నోట్లో పెట్టుకుంటాడు. దీంతో ఆ పాము విలవిల్లాడిపోయింది. వదిలించుకొవడానికి ప్రయత్నించింది.

చివరకు ఇరిటెట్ గా ఫీలయ్యి.. అతడి ముఖంపైగట్టిగా కాటేసింది. అంతటితో ఆగకుండా అతని ముఖాన్ని తన కొరలతో గట్టిగా పట్టేసుకుంటుంది. వెంటనే అతను తెరుకొని పామును దూరంగా జరిపేస్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ పాము మాత్రం విషపూరితం కాదు. దీంతో అతనికి ఎలాంటి ఇబ్బంది కల్గలేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. దీన్ని చూసిన నెటిజన్లు  ఇదేంపైత్యం అంటూ కామెంట్లు చేస్తున్నారు. పొరపాటు అది విషపూరితమైన పామైతే నీసంగతేంటీ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి రిస్క్ లు అవసరమా.. అంటూ మరికొందరు సెటైర్ లు వేస్తున్నారు.

2024-07-03T16:12:46Z dg43tfdfdgfd