SOCIO FANTASY MOVIES: ఫాంటసీ ప్రపంచంలో విహరిస్తున్న టాలీవుడ్ హీరోలు - సరికొత్త అనుభూతిని పంచబోతున్న సినిమాలు!

Socio Fantasy Movies in Telugu: ఇప్పుడు టాలీవుడ్ లో 'ఫాంటసీ' సినిమాల ట్రెండ్ నడుస్తోంది. మన హీరోలంతా సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీస్, సైన్స్ ఫిక్షన్ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రాల్లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేస్తుండటంతో, యువ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకూ.. అందరూ అదే బాటలో పయనిస్తున్నారు. దర్శక రచయితలు సైతం ప్రేక్షకులను సరికొత్త ఊహాజనిత ప్రపంచంలోకి తీసుకెళ్లే కథలను రాసుకుంటున్నారు. ఆధ్యాత్మికతకు సైన్స్‌ ను ముడిపెట్టే స్టోరీలను అందిస్తున్నారు. నిర్మాతలు ఆ స్టోరీల మీద ఎంత బడ్జెట్ పెట్టడానికైనా రెడీ అంటున్నారు. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం భారీగా ఖర్చు చేస్తూ సినీ ప్రియులకు సరికొత్త అనుభూతిని పంచడానికి ప్రయత్నిస్తున్నారు. 

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని నిర్మాత సి. అశ్వినీ దత్ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇది హిందూ పురాణాలు, భారతీయ ఇతిహాసాల ఆధారంగా రూపొందుతున్న ఎపిక్ సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం. మహాభారతం కాలం నుంచి క్రీ.శ. 2898 మధ్య జరిగే 6000 సంవత్సరాల కథను చెప్పబోతున్నారు. ఇందులో భాగంగా దర్శకుడు ఓ ఇమేజినరీ ఫ్యూచర్ వరల్డ్ ను క్రియేట్ చేస్తున్నారు. హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తగ్గకుండా, హై టెక్నికల్ వాల్యూస్ తో తీస్తున్న ఈ సినిమా ఆడియన్స్ కు సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ అందించడానికి టీం కష్టపడుతోంది. ఇప్పటికే ప్రమోషనల్ మెటీరియల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. 

'కల్కి'తో పాటుగా ప్రభాస్ నటిస్తోన్న మరో సినిమా 'రాజా సాబ్'. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే ఇదొక విభిన్నమైన రొమాంటిక్‌ ఫాంటసీ హారర్‌ థ్రిల్లర్‌ అనే ప్రచారం జరుగుతోంది. దర్శకుడు తనదైన శైలిలో ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి, భయపెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక 'తండేల్‌' తర్వాత యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ వర్మ దండుతో చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఫాంటసీ అంశాలతో కూడిన మిస్టిక్ థ్రిల్లర్‌ అని అంటున్నారు. ఇంతకముందు కార్తీక్ ఇదే జోనర్ లో 'విరూపాక్ష' మూవీ చేసిన సంగతి తెలిసిందే.

Also Read: MAY 9TH: మే 9 - టాలీవుడ్‌లో ఈ తేదీకి పెద్ద చరిత్రే ఉంది!

'ఊరు పేరు భైరవకోన' వంటి సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో నిండిన సూపర్ నేచురల్ అడ్వెంచర్ థ్రిల్లర్ తో హిట్ కొట్టిన యంగ్ హీరో సందీప్ కిషన్.. ఇప్పుడు 'మాయావన్' మూవీలో నటిస్తున్నాడు. ఇది సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్.. 2017లో వచ్చిన 'ప్రాజెక్ట్ Z' సినిమాకి సీక్వెల్. తమిళ దర్శకుడు సీవీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సైన్స్ తో ప్రపంచాన్ని శాషించాలనుకునే సూపర్ విలన్, దాన్ని ఎదుర్కొనే కామన్ మ్యాన్ అనే పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ ఆవిష్కరించారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'విశ్వంభర'. పంచభూతాలు, త్రిశూల శక్తి అనే అంశాలకు ఆధ్యాత్మికత కలబోసి ఈ ఫాంటసీ యాక్షన్‌ అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌ ను తీస్తున్నారు. సినిమాలో 70 శాతం వరకు గ్రాఫిక్స్‌ ఉంటాయని.. ప్రేక్షకులకు ఓ సరికొత్త ఫాంటసీ ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నామని చిత్ర బృందం చెబుతోంది. దీని కోసం 13 భారీ సెట్లు కూడా ఏర్పాటు చేసారు. చిరు గతంలో నటించిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా ఫాంటసీ జోనర్ లో క్లాసిక్ గా నిలిచిపోయింది. అలానే కోడి రామకృష్ణ దర్శకత్వంలో చేసిన ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 'అంజి' కూడా సరికొత్త అనుభూతిని పంచింది. మళ్ళీ ఇన్నాళ్లకు బిగ్ బాస్ పూర్తి స్థాయి ఫాంటసీ కథలో రాబోతున్నాయి. 2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. 'బింబిసార' వంటి ఫాంటసీ మూవీతో వశిష్ఠ డైరెక్టర్ గా పరిచయమైన విషయం తెలిసిందే. 

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యువ హీరో తేజ సజ్జా కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హీరో ఫిలిం 'హను-మాన్‌'. ఇది ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, సెన్సేషనల్ సక్సెస్ సాధించింది. దీంతో ఇప్పుడు దర్శక హీరోలిద్దరూ ఫాంటసీ బాటలోనే ముందుకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. తేజ ప్రస్తుతం కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో 'మిరాయ్‌' అనే సూపర్‌ యోధ సినిమా చేస్తున్నారు. ఇందులో ఫాంటసీ అంశాలకు ప్రాధాన్యమున్నట్లు ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌తో క్లారిటీ వచ్చేసింది. మరోవైపు ప్రశాంత్ వర్మ 'హనుమాన్'కు సీక్వెల్ గా 'జై హనుమాన్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇదే క్రమంలో తన సినిమాటిక్‌ యూనివర్స్‌ లో తీయనున్న మిగతా సూపర్‌ హీరో సినిమాలన్నీ ఫాంటసీ జోనర్‌ లోనే ఉండబోతున్నాయి. 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వంలో 'కిష్కిందపురి' అనే సినిమా వస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇది ఫాంటసీ ప్రపంచంలో సాగే హారర్ మిస్టరీ అనే టాక్ ఉంది. ఇక తమిళ్ లో సూర్య 'కంగువ' అనే ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ లో నటిస్తున్నారు. కన్నడలో ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో UI అనే పాన్ ఇండియా ఫాంటసీ చిత్రం రూపొందుతోంది. అలానే రిషబ్ శెట్టి ఇలాంటి జోనర్ లోనే 'కాంతారా' ప్రీక్వెల్ తీస్తున్నారు. 'బంగార్రాజు 2', 'కార్తికేయ 3' లాంటి ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్లు కూడా తెలుగులో రాబోతున్నాయి. 

Also Read:  విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఆగిపోయిన సినిమాలు ఎన్నో తెలుసా?

2024-05-10T03:37:29Z dg43tfdfdgfd