SONALI BENDRE: సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ పై రూమర్స్ పుట్టించేది వాళ్లే.. సోనాలి బింద్రే సంచలన వ్యాఖ్యలు..

Sonali Bendre: సోనాలి బింద్రే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. హిందీలో 1994లో 'ఆగ్' మూవీతో కథానాయికగా పరిచయమైంది. అంతకు ముందు పలు ఉత్పత్తిలకు మోడలింగ్ చేసింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది. హిందీలో దాదాపు అందరి అగ్ర హీరోల సరసన నటించింది. ఇక తెలుగులో ఈమె కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'మురారి' మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇక్కడ ఈమె వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత వెంటనే ఖడ్గం, ఇంద్ర, మన్మథుడు, పలనాటి బ్రహ్మానాయుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపునే తెచ్చుకుంది.

ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. అటు క్యాన్సర్‌తో కొన్నేళ్లు పోరాటం చేసి దాన్ని నుంచి పూర్తిగా  మళ్లీ మాములు మనిషి అయింది. ప్రస్తుతం హిందీలో పలు రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈమె అప్పట్లో జరిగిన కొన్ని విషయాలను ప్రస్తావించారు. అప్పట్లో హీరో, హీరోయిన్స్ మధ్య ఏదో ఉందనే రూమర్స్ గురించి ప్రస్తావించారు. ఇది సినీ ఇండస్ట్రీ మొదలైనప్పటి నుంచి ఉంది. అసలు ఈ రూమర్స్ ఎలా పుట్టుకొస్తాయో తనకు అపుడు తెలిసేది కాదు. నేను ఎపుడైతే.. హీరోయిన్‌గా అడుగుపెట్టిన తర్వాత కొంత మంది నిర్మాతలకు తమ సినిమాలకు పబ్లిసిటీ కోసమే ఈ రూమర్స్ పుట్టించే వాళ్లు. అలా నిర్మాతలు కావాలనే హీరో, హీరోయిన్స్ మధ్య ఏమి లేకపోయినా.. కొన్ని పత్రికలకు ప్రేరేపించి ఈ కథనాలు రాయించే వారని చెప్పుకొచ్చారు. అలా తమ సినిమాలపై అటెన్షన్ గురి చేసేవారనే విషయాన్ని ప్రస్తావించారు. ఇక అప్పట్లో తాను సినీ ఇండస్ట్రీలో డబ్బు కోసమే వచ్చానని చెప్పి సంచలనే రేపింది. ఆమె కాదే ఎవరైన ఇండస్ట్రీలో వచ్చేది డబ్బు సంపాదన కోసమే.  ఏది ఏమైనా హీరోయిన్‌గా ఫేడౌట్ అయ్యాకా సోనాలి బింద్రే ఈ వ్యాఖ్యలు చేయడం ఇపుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Also read: Supreme Court: 'రాహుల్ గాంధీ' పేరుందని ఎన్నికల్లో పోటీ చేయోద్దంటే ఎలా ? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2024-05-04T06:43:27Z dg43tfdfdgfd