SREEMUKHI: ఫొటోషూట్‌లో హొయలొలికిస్తున్న శ్రీముఖి..సింప్లీ సూపర్బ్..చూపులతో చంపేస్తున్నావ్

Sreemukhi: ఫొటోషూట్‌లో హొయలొలికిస్తున్న శ్రీముఖి..సింప్లీ సూపర్బ్..చూపులతో చంపేస్తున్నావ్

తెలుగులో ఉన్న అతికొద్ది మంది స్టార్ యాంకర్ లలో శ్రీముఖి(SreeMukhi) ఒకరు. తనదైన టాకింగ్ పవర్ తో ఆడియన్స్ ను ఫుల్లుగా ఎంటర్టైన్  చేయడం ఆమెకు అలవాటే. ప్రముఖ ఛానెల్ లో ప్రసారమైన అదుర్స్ తో యాంకర్ గా తొలి అడుగువేసి శ్రీముఖి..కొద్దికాలంలోనే స్టార్ యాంకర్ గా ఎదిగింది. 

ప్రస్తుతం ప్రముఖ ఛానెల్స్ లో ప్రసారమవుతున్న చాలా షోస్ కి శ్రీముఖి యాంకర్ గా కొనసాగుతుంది.ఓవైపు యాంకర్ గా ఫుల్ బిజీగా ఉంటూనే..మధ్య మధ్యలో సినిమాల్లో కనిపిస్తూ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.

తాజాగా ట్రెడిషనల్ వేర్ లో దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. గ్రే కలర్ వన్ మినిట్ శారీలో అందాలు హొయలొలికించింది..తనదైన అందాలు చూపిస్తూనే పైటను పట్టుకుని పోజులు ఇచ్చింది. ఒక్కో ఫోటో చాలదన్నట్టు రకరకాల స్టిల్స్ లో కుర్రాళ్లను అదరగొట్టేసింది. అంతేకాకుండా తన ఓర చూపులతో కుర్రకారుతో పాటు ఇండస్ట్రీ మేకర్స్ దృష్టిని కూడా తన వైపు తిప్పుకునేలా చేస్తోంది.

ఏ మాటకి ఆ మాట చెప్పాలంటే..తన డైమండ్ సెట్, పాపిట చైన్ శ్రీముఖి అందాన్ని మరింత పెంచుతూ..కుర్రాళ్ళకి నిదుర లేకుండా చేసేలా తయారయింది.దీంతో నెటిజన్స్ నుంచి, తన ఫ్యాన్స్ నుంచి కామెంట్స్ వర్షం కురుస్తుంది. నీకు తప్పకుండా అవకాశాలు వస్తాయి..డోంట్ ఫీల్ అని కొందరు అంటుండగా,డ్రెస్సింగ్ కంటే చూపులతో చంపేస్తున్నావ్..సింప్లీ సూపర్బ్' ఇంకొందరు పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో నటించిన శ్రీముఖి ఖుషీ నడుము సీన్ ను రీక్రియెట్ చేసి స్క్రీన్ పై రచ్చ రచ్చ చేసింది. ఇక అప్పటినుండి మరో సినిమాలో కనిపించని శ్రీముఖి..ఇప్పుడు అల్లు అర్జున్..అట్లీ సినిమాలో మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

©️ VIL Media Pvt Ltd.

2024-05-02T16:46:52Z dg43tfdfdgfd