SREEMUKHI: శ్రీముఖిపై మనసు పారేసుకుంటున్న కుర్రాళ్ళు.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

ఈ మధ్యకాలంలో యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాను ఫుల్లుగా వాడేస్తోంది. వరుస ఫోటో షూట్స్ వదులుతూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. సరికొత్తగా ట్రాన్స్ ఫామ్ అవుతూ తన గ్లామర్‌తో రచ్చ చేస్తోంది. దీంతో కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు.
గ్లామర్ ఫొటోస్ షేర్ చేయడంతో పాటు డిఫరెంట్ టైప్ లుక్స్ తన సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ హంగామా చేస్తోంది శ్రీముఖి. దీంతో శ్రీముఖి లవ్ యూ అంటూ యూత్ రెచ్చిపోతున్నారు. ఆమెపై రొమాంటిక్ బాణాలు వదులుతున్నారు.
చిన్నితెరపై స్టార్ యాంకర్ గా భారీ పాపులారిటీ సంపాదించింది శ్రీముఖి. మరోవైపు సోషల్ మీడియాలో కూడా తెగ హంగామా చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ రచ్చ చేస్తున్న శ్రీముఖి.. తాజాగా జిగేల్ అనిపించే సొగసుతో స్పెషల్ గా అట్రాక్ట్ చేసింది.
ఒకానొక సమయంలో బొద్దుగా కనిపించిన శ్రీముఖి.. ఈ ఫొటోల్లో మాత్రం చాలా స్లిమ్ లుక్ లో దర్శనమిచ్చింది. ఆమెనిలా చూసి రాములమ్మ లుక్ అదిరింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూ వస్తోంది యాంకర్ శ్రీముఖి. తనదైన చలాకీతనంతో కుర్రకారు మనసు దోచుకున్న శ్రీముఖి.. బుల్లితెర అల్లరి పిల్లగా ఫేమస్ అయింది.
వరుస షోలతో టీవీ ఆడియెన్స్ ను అలరిస్తున్న శ్రీముఖి.. కెరీర్ పరంగా ముందుకెళ్లే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సరైన ఆఫర్స్ వస్తే వెండితెరపై రాణించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ అందరి దృష్టిని లాగేస్తోంది.
తన టాలెంట్ తో వచ్చిన ఫేమ్ శ్రీముఖికి బిగ్ బాస్ ఆఫర్ కూడా తెచ్చిపెట్టింది. బిగ్ బాస్ తెలుగు 3 లో పాల్గొని రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి.. ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై తెగ హంగామా చేస్తోంది. బుల్లితెర షోస్ తో పాటు సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తోంది.
ప్రస్తుతం శ్రీముఖి ఒక్కో షోకి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. పలు స్పెషల్ ఈవెంట్స్ కూడా చేస్తూ బాగానే పైకం తీసుకుంటోందట ఈ ముద్దుగుమ్మ.
రీసెంట్ గా చిరంజీవి హీరోగా వచ్చిన భోళా శంకర్ సినిమాలో శ్రీముఖి నటించింది. ఈ సినిమాలో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ స్పెషల్ అట్రాక్షన్ కాగా.. కాసింత ట్రోలింగ్ కూడా నడిచింది.

2024-03-29T09:46:30Z dg43tfdfdgfd