SUDHA REDDY: 200 క్యారెట్ డైమండ్ జ్యువలరీతో ఆకట్టుకున్న సుధారెడ్డి - మెట్‌ గాలాలో మెరిసిన తెలుగు వాణిజ్యవేత్త

Sudha Reddy At Met Gala 2024: 2024 మెట్ గాలా ఈవెంట్ ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలతో నిండిపోయింది. ఈ ఈవెంట్‌లో ఒకరికి మించి మరొకరు ముస్తాబయ్యి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అలా వైరల్ అవుతున్నవారిలో బిజినెస్ ఉమెన్ సుధా రెడ్డి కూడా ఒకరు. ఒక ఐవరీ సిల్క్ గౌన్‌లో మెట్ గాలా ఈవెంట్‌కు హాజరయ్యారు సుధా రెడ్డి. సినీ సెలబ్రిటీలకు పోటీ ఇచ్చే ఫ్యాషన్ సెన్స్‌తో సుధా అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో తన సిల్క్ గౌన్ గురించే నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. గౌన్ మాత్రమే కాదు తను మెడలో ధరించిన డైమండ్ నెక్లెస్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఫ్యామిలీకి గుర్తుగా..

సుధా రెడ్డి ‘అమోర్ ఎటెర్నో’ అనే జ్యువలరీ బ్రాండ్‌కు చెందిన డైమండ్ నెక్లెస్‌ను ధరించారు. ఇది ఏకంగా 180 క్యారెట్ డైమండ్ నెక్లెస్ అని సమాచారం. ఈ డైమండ్ నెక్లెస్‌కు ధరించిన లాకెట్టే 25 క్యారెట్లు ఉంటుందట. ఈ నెక్లెస్‌కు ఒక 25 క్యారెట్ హార్ట్ షేప్ డైమండ్‌ లాకెట్‌తో పాటు మరో మూడు 20 క్యారెట్ల హార్ట్ షేప్ డైమండ్స్ కూడా ఉన్నాయి. ఆ మూడు హార్ట్స్‌ను తన భర్త, ఇద్దరు పిల్లలు మానస్, ప్రణవ్‌కు ప్రతీకగా ధరించారట సుధా రెడ్డి. నెక్లెస్ మాత్రమే కాదు సుధా రెడ్డి చేతికి పెట్టుకున్న రెండు రింగ్స్ కూడా డైమండ్సే అని తెలుస్తోంది. అందులో ఒకటి 23 క్యారెట్ డైమండ్ రింగ్ కాగా మరొకటి 20 క్యారెట్ డైమండ్ రింగ్ అని సమాచారం.

వంద కోట్లు..

సుధా రెడ్డి ధరించిన రింగ్స్ ధర దాదాపు 20 మిలియన్ ఉంటుందని తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీలో ఏకంగా రూ.165 కోట్లు. మెట్ గాలా ఈవెంట్‌లో తన అప్పీయరెన్స్ ద్వారా హైలెట్ అయ్యారు సుధా రెడ్డి. దీంతో ఈమె ఎవరో తెలియని వారు గూగుల్‌లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు. సుధా రెడ్డి హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ మేఘా కృష్ణా రెడ్డి భార్య. అంతే కాకుండా మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌ (ఎమ్ఈఐఎల్)కు డైరెక్టర్ కూడా. బిజినెస్‌లో సుధా ఎంత బిజీగా ఉన్నా.. చారిటీ సంబంధిత విషయాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా సుధా రెడ్డికి 8 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

4500 గంటలు కష్టపడ్డారు..

మెట్ గాలాలో తను ధరించిన గౌన్ ఫోటోలను పోస్ట్ చేస్తూ దాని డిజైన్ గురించి, మేకింగ్ గురించి చెప్పుకొచ్చారు సుధా రెడ్డి. తను ధరించిన ఐవరీ సిల్క్ గౌన్‌ను తయారు చేయడానికి 80 మండి డిజైనర్లు.. 4,500 గంటలు కష్టపడ్డారట. దీనిపై పర్ల్ ఫ్లవర్స్‌తో పాటు 3డీ బటర్ ఫ్లై డిజైన్స్ కూడా జతచేర్చారు. ఈ గౌన్‌ను ఫరా అలీ ఖాన్ డిజైన్ చేశారని కూడా సుధా రెడ్డి బయటపెట్టారు. 19 ఏళ్లకే కృష్ణా రెడ్డిని పెళ్లి చేసుకున్నారు సుధా. తన సొంతూరు విజయవాడ అయినా కూడా కృష్ణా రెడ్డిని పెళ్లి చేసుకోవడంతో హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు. తన బిజినెస్ స్కిల్స్ చూసి అందరూ తనను ‘క్వీన్ బీ ఆఫ్ హైదరాబాద్’ అని అంటుంటారు.

Also Read: విడాకులపై శ్రీజ కొణిదెలకు నెటిజన్ ప్రశ్న - మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటే అతనితో కలిసి ఉంటారా?

2024-05-08T12:00:18Z dg43tfdfdgfd