Suriya 44 Movie: క్రేజీ కాంబో..కార్తీక్ సుబ్బరాజుతో సూర్య కొత్త సినిమా షురూ
డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ఆకట్టుకునే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉన్నారు.ఆ తర్వాత డైరెక్టర్ సుధా కొంగర ప్రాజెక్టులో జాయిన్ అవ్వబోతున్నారు. సూర్య 43 టైటిల్‌గా వస్తోన్నఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కనుంది.
అయితే ఈ రెండు సినిమాలు షూటింగ్లో ఉండగానే సూర్య మరో స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు. ఇంతకి ఆ దర్శకుడు ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదు ఇటీవలే జిగర్ తండా డబుల్ ఎక్స్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్న తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju).
లేటెస్ట్గా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ను డైరెక్టర్ కార్తీక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.'సూర్య44 రానున్న ఈ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేయడం చాలా హ్యాపీ.దీనికి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పోస్ట్ లో తెలిపారు. ఇక ఈ సినిమాను సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్,స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ నిర్మించనుంది.
అయితే ఈ పోస్టర్ గమనిస్తే దట్టమైన అడవి చుట్టూరా కార్చిచ్చు..ఒక కారు..పెద్ద చెట్టుపై బాణం..దాని అడుగుభాగాన లవ్..లాఫర్..వార్ అంటూ రాసి ఉంది. ఇది చాలు కదా సూర్య మూవీ అంటే..అనౌన్స్ పోస్టర్ తోనే ఆసక్తి రేపాడు డైరెక్టర్.
కంగువ సినిమా విషయానికి వస్తే..ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్,టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి.
రీసెంట్ రిలీజ్ చేసిన టీజర్ లో సూర్య నట విశ్వరూపం చూపించాడు. అగ్నితో సెగలు రేపే అటవిక యోధుడిగా సూర్య వైల్డ్ లుక్ ఆకట్టుకుంటోంది. బ్యూటీ దిషా పఠాని హీరోయిన్గా నటిస్తోంది. 3Dలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు..రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పది భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా..త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
©️ VIL Media Pvt Ltd. 2024-03-28T16:57:18Z dg43tfdfdgfd