TAMANNAAH BHATIA: హీరోయిన్ తమన్నాపై కేసు.. నోటీసులు పంపిన పోలీసులు

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన కొత్త చిత్రం అరణ్మనై 4 (బాక్) విడుదల కోసం ఎదురుచూస్తుంది. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రంలో తమన్నాతో పాటు రాశి ఖన్నా కూడా నటించింది. అయితే తాజాగా ఓ బెట్టింగ్ యాప్‌కి సంబంధించిన కేసులో తమన్నాకి నోటీసులు వచ్చాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

ప్రమోట్ చేసినందుకు

తమన్నాకి మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను నిబంధనలకు విరుద్ధంగా ఫెయిర్‌ప్లే యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. తాజాగా ఈ యాప్‌ను తమన్నా ప్రమోట్ చేసింది. దీంతో ఈ నెల 29న విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

తమన్నా చేసిన ప్రమోషన్ వల్ల తమకి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని వయాకామ్ ఫిర్యాదు చేసింది. ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను వయాకామ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వయాకామ్ ఫిర్యాదు ఆధారంగా మహారాష్ట్ర సైబర్ సెల్ ఫెయిర్‌ప్లే యాప్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ విషయంపై మరింత దర్యాప్తు చేయడానికి తమన్నాను విచారించడానికే నోటీసులు పంపినట్లు పోలీసులు తెలిపారు.

సంజయ్ దత్‌పై

మరోవైపు ఇదే కేసులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌కి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని చెప్పినా సంజయ్ గైర్హాజరయ్యారు. దీనిపై వివరణ కూడా ఇచ్చారు. ఆ రోజు తాను ముంబైలో లేనని తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు మరో తేదీని సూచించాలని పోలీసులను ఆయన కోరారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023ని ఫెయిర్‌ప్లే యాప్ చట్టవిరుద్ధంగా ప్రదర్శిస్తుందని ఈ కారణంగా తమకు రూ. 100 కోట్ల వరకూ నష్టం వాటిల్లిందని వయాకామ్ ఫిర్యాదులో పేర్కొంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-25T06:57:07Z dg43tfdfdgfd