TEENMAAR MALLANNA: తీన్మార్ మల్లన్నకు జాక్ పాట్.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ స్థానం నుంచి పోటీ..

Teenmaar Mallanna As MLC: తీన్మార్‌ మల్లన్న జాక్ పాట్ కొట్టాడు. గతంలో ఓడిన మల్లన్నకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించంది. ఈ మేరకు బుధవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన రిలీజ్ చేశారు. పల్లా రాజీనామాతో ఈ స్థానానికి ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరగబోతుంది. ఇదే స్థానం నుంచి గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు తీన్మార్ మల్లన్న. 

2021 మార్చిలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం 2027 మార్చి వరకు ఉంది. అయితే గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో పల్లా ఎమ్మెల్సీ పదవికి డిసెంబరు 09న రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఈ స్థానానికి సంబంధించిన షెడ్యూల్ ను త్వరలోనే రిలీజ్ చేయనుంది. ఈ క్రమంలోనే హస్తం పార్టీ తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న పేరును ప్రకటించింది. 

Also read: Harish Rao: నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్

ఇదిలా ఉండగా.. తెలంగాణలో మిగిలిన మూడు లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను అనౌన్స్ చేసింది. హైదరాబాద్ నుంచి మహమ్మద్‌ సమీర్‌, కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్, ఖమ్మం నుంచి రామసహాయం రఘురామ రెడ్డి  పేర్లను ఖరారు చేసింది. ఎన్నికల నామినేషన్ కు రేపే చివరితేదీ కావడంతో అభ్యర్థులను ప్రకటించింది అధిష్టానం. అయితే  అధిష్టానం ప్రకటించకముందే రాజేందర్, రఘురామ్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. 

Also read: Lok Sabha Elections 2024: ఓవైసీకి దిమ్మతిరిగే షాక్.. మాధవీలత భారీగా నామినేషన్ ర్యాలీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2024-04-24T17:12:39Z dg43tfdfdgfd