THALAIMAI SEYALAGAM: రాధిక నిర్మాణంలో శ్రియారెడ్డి..ZEE5 లో రానున్న పొలిటికల్ థ్రిల్లర్ తలమై సెయల్గమ్

Thalaimai Seyalagam OTT: జాతీయ అవార్డ్ గ్ర‌హీత వ‌సంత్ బాల‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అలనాటి హీరోయిన్ రాధికా శ‌ర‌త్‌కుమార్‌ తలమై సెయల్గమ్ అనే వెబ్ సిరీస్ నిర్మించారు. పొలిటికల్ థ్రిల్లర్ గా రానున్న ఈ సిరీస్ మే 17 నుంచి ZEE5లో స్ట్రీమింగ్‌

కానంది. ఈ సిరీస్ లో ప్ర‌ధాన తారాగ‌ణంగా శ్రియారెడ్డి, కిషోర్‌, ఆదిత్య మీన‌న్‌, భ‌ర‌త్ నటించారు. కాగా జీ5 ఈరోజు ఈ సిరీస్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. త‌మిళ రాజ‌కీయాల్లో అధికార దాహాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసే డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ఈ వెబ్ సిరీస్ రూపొందించడం విశేషం.

దాదాపు 8 భాగాలుగా రూపొందిన ఈ పొలిటిక‌ల్ థ్రిల్లింగ్ సిరీస్‌ను రాడాన్ మీడియా వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై  రాధిక శరత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ టీజర్ విషయానికి వస్తే ముఖ్య‌మంత్రి అరుణాచ‌లం అవినీతి ఆరోప‌ణ‌ల‌తో దాదాపు 15 సంవ‌త్స‌రాలుగా విచార‌ణ‌ను ఎదుర్కొంటుంటారు. ముఖ్య‌మంత్రి కావాల‌ని, ఆ ప‌ద‌వి కోసం వారిలో ఇది కోరిక‌ను మ‌రింత‌గా పెంచుతుంది. మరోపక్క జార్ఖండ్‌లోని మారుమూల ప‌ల్లెటూరులో, 20 సంవత్సరాల ముందు జ‌రిగిన పాత మ‌ర్డ‌ర్ కేసుని సీబీఐ ఆఫీస‌ర్ వాన్ ఖాన్ ప‌రిశోధిస్తుంటారు. ఇక అదే స‌మ‌యంలో చెన్న నగ‌నంలో త‌ల‌, శ‌రీర‌భాగాలు వేరు చేయ‌బ‌డిన ఓ శ‌రీరం పోలీసులకు దొరుకుతుంది. ఈ భ‌యంక‌ర ఘ‌ట‌న‌కు కార‌కులైన వారిని క‌నిపెట్ట‌టానికి చెన్నై డీజీపీ మ‌ణికంద‌న్ ఇన్వెస్టిగేషన్ మొదలుపడతారు. క్ర‌మ‌క్ర‌మంగా న‌గ‌రంలో జ‌ర‌ర‌గుతున్న ఈ సంఘటనల వెనక దాగున్న అసలు నిజం బయటకు వస్తుంది. అదేంటో తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందేనంటున్నారు ఈ సిరీస్ మేక‌ర్స్‌. 

కాగా ఈ సీరియస్ గురించి రాధికా శ‌ర‌త్ కుమార్ మాట్లాడుతూ ‘‘‘తలమై సెయల్గమ్’ సిరీస్‌ను జీ 5తో క‌లిసి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల‌కు అందించ‌టం నాకు చాలా ఆనందంగా ఉంది. జాతీయ రాజ‌కీయాల్లో త‌మిళ‌నాడు రాజ‌కీయాల ప్ర‌భావంతో పాటు జార్ఖండ్‌లోని కింది స్థాయి కార్య‌కర్త‌లు, తిరుగుబాటు గ్రూపుల మ‌ధ్య ఉండే సంక్లిష్ట ప‌రిస్థితుల‌ను ఈ వెబ్ సిరీస్ లో చాలా చక్కగా చూపించారు దర్శకుడు. రాజకీయ వార‌స‌త్వానికి అతీతంగా ఓ మ‌హిళ అధికారంలోకి వ‌స్తే ఏం జ‌రుగుతుంద‌నే ప‌రిస్థితుల‌పై సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ సిరీస్ తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని చెప్పుకొచ్చారు.

న‌టి శ్రియా రెడ్డి మాట్లాడుతూ ‘‘ఇందులో నేను కొట్ర‌వై అనే పాత్ర‌లో కనిపించనున్నాను. ఇలాంటి ఓ డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన సిరీస్‌లో భాగం కావ‌టం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వైవిధ్య‌మైన షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌టం అనేది న‌టిగా నాకు ఛాలెజింగ్‌గా అనిపించింది. మ‌నం మ‌న శ‌త్రువుకు ఎదురుగా క‌త్తితో నిల‌బ‌డ్డ‌ప్పుడు వాళ్లు మ‌న‌పై మ‌రిన్ని క‌త్తుల‌ను ప్ర‌యోగిస్తారు అనే సిద్ధాంతాన్ని న‌మ్మే పాత్రలో నేను కనిపించనున్నాను.’’ అన్నారు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-05-04T16:14:59Z dg43tfdfdgfd