THALAIVAR 171 FIRST LOOK: తలైవా 171’ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది - అంచనాలు పెంచేస్తున్న రజనీ లుక్‌!

Thalaivar 171 First Look Out: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ అప్డేట్ వచ్చేసింది. 'విక్రమ్‌' ఫేం లోకేష్‌ కనగరాజ్- తలైవా కాంబినేషన్‌లో ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. 'తలైవా 171' అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించారు.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ మూవీ తాజాగా సాలీడ్‌ ఇచ్చాడు లోకేష్‌ కనగరాజ్‌. ఈ చిత్రంలోని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో తలైవా లుక్‌ నెక్ట్స్‌ లెవల్‌ అని చెప్పాలి.

ఇందులో తలైవా ఇదివరకు ఎన్నడు చూడని సరికొత్తగా కనిపించాడు. స్టైలిష్‌ కళ్లద్దాలు, లగ్జరీ వాచ్‌తో గ్యాంబ్లర్‌ లుక్‌లో కనిపించాడు. ఇందులో తలైవా మరింత యంగ్‌గా కనిపించారు. ప్రస్తుతం ఆయన లుక్‌ బాగా ఆకట్టుకుంటుంది. ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ సినిమాలో అంచనాలు పెంచేస్తోంది. ఈ లుక్‌ని విడుదల చేస్తూ టైటిల్‌ ఏప్రిల్‌ 22 ప్రకటించనున్నట్టు వెల్లడించాడు డైరెక్టర్‌ కనగరాజ్‌. కాగా ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తుండగా.. కోలీవుడ్‌ యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నాడు. 

2024-03-28T14:01:52Z dg43tfdfdgfd