THAMMUDU: నితిన్ తమ్ముడు సినిమాలో రెండో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే?

'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఫ్లాప్ అయిన తర్వాత నితిన్ తన రాబోయే ప్రాజెక్ట్ 'తమ్ముడు'పై కాన్సట్రేషన్ చేస్తున్నాడు. భీమ్లా నాయక్ సినిమాతో పేరు తెచ్చుకున్న వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో 'కాంతార' ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుంది. తాజాగా ఈ ప్రాజెక్టు గురించి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.

ఆ హీరోయిన్ కూడా

ఇటీవల 'ఊరు పేరు భైరవకోన' సినిమాతో హిట్ కొట్టిన హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా నటించబోతున్నట్లు టాక్. అయితే ఇది సినిమాలో పూర్తి స్థాయిలో ఉండే క్యారెక్టర కాకపోయినప్పటికీ కీలక పాత్రగా చెబుతున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది.

ఇక ఈ సినిమాలో నితిన్ సోదరిగా లయ యాక్ట్ చేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. రూ8 కోట్లతో ఓ హై-ఆక్టేన్ ఫైట్ సీక్వెన్స్‌ను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-28T06:54:14Z dg43tfdfdgfd