THE FAMILY STAR TRAILER: ది ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ వచ్చేసింది.. ఇప్పుడు ప్రశాంతంగా ఉందట!

The Family Star Trailer: ది ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ వచ్చేసింది.. ఇప్పుడు ప్రశాంతంగా ఉందట!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family star). దర్శకుడు పరశురామ్(Parasuram) తెరకెక్కించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తున్నారు. గీతగోవిందం లాంటి సూపర్ హిట్ తరువాత విజయ్, పరశురామ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ది ఫ్యామిలీ స్టార్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడుతున్నాయి. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.  చూస్తుంటే కంప్లీట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కనిపిస్తోంది. మధ్యతరగతి కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్‌, బాధ్యతలు, ప్రేమ వంటి అంశాలతో ట్రైలర్ ను నింపేశారు. వాటిని విజయ్ ఎలా హ్యాండిల్ చేశాడు అనే విషయాన్నీ ఎంటర్టైనింగా చూపించబోతున్నారనే విషయం అర్థమవుతోంది. అయితే ఈసారి యాక్షన్ పాల్లు కూడా  కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. మొత్తానికి ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని ఫిక్స్ అయ్యాడు విజయ్ దేవరకొండ. మరి ఆడియన్స్ కోరుకుంటున్న ఎంటర్టైన్మెంట్ ను విజయ్ ఈ సినిమాతో ఇస్తాడా అనేది చూడాలి.

©️ VIL Media Pvt Ltd.

2024-03-28T06:41:20Z dg43tfdfdgfd