TILLU 2 RELEASE TRAILR TALK REVIEW: టిల్లు స్క్వేర్ రిలీజ్ ట్రైలర్ టాక్ రివ్యూ.. సిద్దు బాగానే కొట్టేలా ఉన్నాడే..

Tillu 2 Release Trailr Talk Review: సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. దాదాపు దశాబ్దం క్రితమే నటుడిగా పరిచయమైన పెద్దగా బ్రేక్ మాత్రం రాలేదు. టిజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకున్నసిద్దు..ఇపుడు టిల్లు స్క్వేర్ మూవీ పలకరించబోతున్నాడు. మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇపుడు సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.

Tillu 2 Release Trailr Talk Review: సిద్దు జొన్నలగడ్డ పదేళ్ల  నాగ చైతన్య హీరోగా నటించిన 'జోష్‌' మూవీతో పరిచయ్యాడు. ఆ తర్వాత 'గుంటూరు టాకీస్‌' మూవీలో తన యాక్టింగ్‌తో అదగొట్టాడు. మధ్యలో 'కృష్ణ అండ్ హీజ్ లీలా' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 2022లో ఈయన రైటర్‌గా విమల్ కృష్ణ చేసిన 'డీజే టిల్లు' మూవీతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమా ఆ యేడాది బ్లాక్ బస్టర్‌గా నిలవడమే కాకుండా మంచి సక్సెస్ సాధించింది. ఇపుడీ మూవీకి సీక్వెల్‌గా 'టిల్లు స్క్కేర్' మూవీ చేసాడు. మల్లిక్ రామ్ దర్శకత్వంలో మల్లిక్ రామ్ దర్శకుడిగా ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా కూడా ఔట్ అండ్ ఔట్ మాస్ కామెడీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కింది. ట్రైలర్ కూడా యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ సినిమాలో హద్దులు దాటి సిద్దుకు మూతి ముద్దులు ఇచ్చేసింది. ఈ సినిమాలో సిద్దు, అనుపమ కెమిస్ట్రీ ప్రేక్షకులకు కనెక్ట్ కావడం పక్కా అని చెబుతున్నారు. ఈ ట్రైలర్‌లో రొమాన్స్‌తో పాటు కామెడీ ప్లస్ యాక్షన్ అదుర్స్ అనేలా ఉంది. ఈ సినిమాకు కాస్త పాజిటివ్‌ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ కుమ్మడం ఖాయం అని చెప్పాలి. ఇప్పటికే ఇంటర్‌, టెన్త్ ఎగ్జామ్స్ కంప్లీటై పిల్లలకు సెలవులు కూడా రావడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు.

ఈ సినిమాకు సిద్దు దాదాపు రూ. 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. టిల్లు స్క్వేర్ సినిమాను సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్, శ్రీకర ప్రొడక్షన్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కింది. సిద్దు నటించిన డీజే టిల్లు విషయానికొస్తే.. ఈ సినిమాలో  తన యాక్టింగ్, మేనరిజమ్స్‌తో తెగ ఆకట్టుకున్నాడు. మరి టిల్లు స్క్వేర్‌తో సిద్దు ఆ మ్యాజిక్‌ను కంటిన్యూ చేస్తాడా లేదా అనేది చూడాలి.

Also Read: Kavitha: నిందితురాలిగా చేర్చిన సీబీఐ.. లిక్కర్‌ స్కామ్‌లో కవిత అరెస్ట్‌ తప్పదా?

Also Read: Rs 500 Gas: మేడారంలో రేవంత్‌ రెడ్డి శుభవార్త.. రూ.500కే గ్యాస్‌, రుణమాఫీ ఎప్పటినుంచంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2024-03-28T03:00:20Z dg43tfdfdgfd