TITANIC ACTOR PASSES AWAY: టైటానిక్ నటుడు కన్నుమూత

టైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన నటుడు బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూశారు. వృద్ధ్యాప్య సమస్యల కారణంగా ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. టైటానిక్ సినిమాలో బెర్నార్డ్ ..షిప్ కెప్టెన్‌ ఎడ్వర్డ్‌ స్మిత్‌ అనే పాత్రను పోషించి మంచి గుర్తింపు పొందారు. ప్రయాణికులను కాపాడలేని కెప్టెన్ ప్రాణాలతో బయటపడినా చనిపోయినట్లేననంటూ ప్రయాణికులను కాపాడే పాత్రలో బెర్నార్డ్ అద్భుతంగా నటించారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలో రోహన్ రాజు థియోడెన్‌గా ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

---- Polls module would be displayed here ----

యూకేకు చెందిన బెర్నార్డ్ ఐదు దశాబ్దాలుగా సినీ రంగంలో కొనసాగారు. సినిమా ఆర్టిస్ట్‌గానే కాకుండా టీవీ ఆర్టిస్ట్‌గా, స్టేజ్ ఆర్టిస్ట్‌గా సేవలందించి నటనకు ప్రాణం పోశారు. లార్డ్ ఆఫ్ ద రింగ్స్, ట్రయాలజీ, ద టూ టవర్స్, రిటర్న్ ఆఫ్ ది కింగ్ సినిమాల్లో కనబరిచిన అద్భుతమైన నటనకు 11 ఆస్కార్లు అందుకున్నారు.

పెద్ద అందగత్తే: అరుంధతిలో నటించిన ఈ చిన్నారి ఎంత అందంగా ఉందో చూడండి.. హీరోయిన్ కూడా

బెర్నార్డ్ హిల్ మరణం నేపథ్యంలో హాలీవుడ్ సినీ లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన అభిమానులు, ఇతర సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

2024-05-06T16:46:29Z dg43tfdfdgfd