TOLLYWOOD MOVIES 2024: ఒకే బ్యాక్ డ్రాప్ లో రానున్న స్టార్ హీరోల చిత్రాలు.. బన్నీ,‌ తారక్ కూడా అదే రూట్

Tollywood Upcoming Rural Movies 2024: టాలీవుడ్ లో ప్రస్తుతం రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమాల హవా నడుస్తోంది. చిన్న హీరో, పెద్ద హీరో అని తేడా లేకుండా.. దాదాపు అందరూ హీరోలు రా అండ్ రస్టిక్ తరహా కథలను పాత్రలను ఎంచుకోవడం అభిమానులను సైతం సర్ప్రైజ్ కి గురిచేస్తోంది. ఇప్పటిదాకా పక్కింటి అబ్బాయి తరహా పాత్రలు చేసిన హీరోలు కూడా ఇప్పుడు రగ్గెడ్ లుక్ లోకి మారిపోతూ ఫాన్స్ కి సైతం షాక్ ఇస్తున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు చేస్తున్న హీరోల జాబితా కూడా పెద్దగానే ఉంది. మరి త్వరలో ఎవరెవరు ఈ జాబితా సినిమాలు చేయబోతున్నారో ఒకసారి చూద్దాం..

అల్లు అర్జున్ : 

పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటన జాతీయ అవార్డును కూడా అందుకుంది. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ గా పుష్ప: ది రూల్ కూడా త్వరలో తెరకెక్కనుంది. మరొకసారి అల్లు అర్జున్ ని రూరల్ బ్యాక్ డ్రాప్ లో చూడటానికి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న శ్రీవల్లి అనే డి-గ్లామరస్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది.

ప్రభాస్ : 

ప్యాన్ ఇండియా రేంజ్ స్టేటస్ ఉన్న ప్రభాస్ కూడా మారుతీ దర్శకత్వంలో వస్తున్న ది రాజా సాబ్ సినిమాలో రగ్గెడ్ గెటప్ లోనే కనిపించనున్నారు. ప్రభాస్ లుంగీ కట్టుకొని ఉన్న పోస్టర్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. ఈ లుక్ లో ప్రభాస్ ని చూడాలని అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.

రామ్ చరణ్ : 

ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో.. చిట్టి బాబు అనే పల్లెటూరి అబ్బాయి పాత్రలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు రామ్ చరణ్. ఇక ఇప్పుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న RC16 సినిమాలో కూడా రగ్గెడ్ పాత్రలోనే కనిపించనున్నారు. రా అండ్ రస్టిక్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా గా ఈ చిత్రం తెరకెక్కనుంది.

వెంకటేష్ :

యువ హీరోల సంగతి పక్కనపెడితే..సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలో నటిస్తున్నారట. ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్ గా.. వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల కాబోతున్న ఈ సినిమా పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. 

విజయ్ దేవరకొండ :

ఫ్యామిలీ స్టార్ సినిమాతో కూడా మరొక డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ ఈసారి తన రూట్ పూర్తిగా మార్చేసి ఒక రూరల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో.. రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పొలిటికల్ టచ్ కూడా ఉండబోతుందట. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి కూడా.. రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో.. విజయ్ దేవరకొండ 18వ శతాబ్దంలో సెట్ అయిన ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు

నాగచైతన్య :

యంగ్ హీరో నాగచైతన్య కూడా చందుమొండేటి దర్శకత్వంలో సర్వైవల్ యాక్షన్ త్రిల్లర్ తండేల్ లో ఇప్పటిదాకా ఎప్పుడు కనిపించనటువంటి పాత్రలో కనిపించనున్నారు. ఒక చేపలు పట్టుకునే వాడిగా నాగచైతన్య ఈ సినిమాలో ప్రేక్షకులను అలరించనున్నారు.

విశ్వక్ సేన్ : 

గామి వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలను చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కూడా చీకటి ప్రపంచంలో సామాన్యుడి పాత్రలో కనిపించనున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Also Read: KTR: ఎన్నికల్లో 12 ఎంపీలు ఇవ్వండి.. కేసీఆర్‌ను సీఎం చేద్దాం: కేటీఆర్‌ పిలుపు

Also Read: Narendra Modi: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల సిద్ధాంతం బై ద ఫ్యామిలీ, ఫర్ ద ఫ్యామిలీ.. ఆఫ్ ద ఫ్యామిలీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2024-05-10T14:55:30Z dg43tfdfdgfd