TURBO RELEASE DATE: టర్బో కొత్త రిలీజ్ డేట్..నెల ముందుగానే థియేటర్స్కి రెడీ అంటున్న మెగాస్టార్

Turbo Release Date: టర్బో కొత్త రిలీజ్ డేట్..నెల ముందుగానే థియేటర్స్కి రెడీ అంటున్న మెగాస్టార్

72ఏళ్ల వయస్సు గల మమ్ముట్టి (Mammootty)..జెడ్ స్పీడ్తో నటించే సత్తువా ఉందంటే..తనకు సినిమాపై ఉన్న మక్కువెంతో అర్ధం అవుతుంది. ప్రస్తుతం మమ్ముట్టి టర్బో అనే మూవీలో నటిస్తున్నాడు. వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్న ఈ థ్రిల్లర్ మూవీకి మిధున్ మాన్యువల్ థామస్ కథను అందించాడు. మమ్ముట్టి తన బ్యానర్‌‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుని వరసగా రిలీజ్ డేట్స్ ప్రకటిస్తూ వస్తోంది. 

అయితే తాజాగా మరో కొత్త డేట్ ని అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. గతంలో అనౌన్స్ చేసిన తేదీ కంటే నెల ముందుగానే..టర్బో మూవీని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. జూన్ 13న రిలీజ్ కావాల్సిన టర్బో సినిమా మే 23న ఆడియన్స్ ముందుకు రాబోతుందని అధికారిక ప్రకటన వచ్చింది. ఈ టర్బో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం తో ఓ రెర్ రికార్డ్ మమ్ముట్టి క్రియేట్ చేసినట్టు అయింది. 

గతేడాది మమ్ముట్టి నటిస్తూ..నిర్మించిన చిత్రం క‌న్నూర్ స్క్వాడ్‌ (Kannur Squad).కేవలం రూ.25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన క‌న్నూర్ స్క్వాడ్‌ మూవీ..వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి కేర‌ళ‌ బాక్సాఫీస్ దుమ్ము దులిపేసింది.అలాగే రీసెంట్ ఫిల్మ్ కాదల్ ది కోర్ మూవీ రూ.50 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టగా..అలాగే చీకటి యుగాల నేపథ్యంలో వచ్చిన భ్రమయుగం మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది.

మమ్ముట్టి నుంచి చాలా రోజుల తర్వాత పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ అవతారంలో వస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.దీంతోపాటు మమ్ముట్టి బజూక సినిమాలో కూడా నటిస్తున్నాడు.ప్రస్తుతం బజూక పోస్ట్ ప్రొడక్షన్‌ దశలో ఉండగా..మరో మూవీ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది.

©️ VIL Media Pvt Ltd.

2024-05-08T16:53:20Z dg43tfdfdgfd