V HANUMANTH RAO: భట్టి నాపై పగబట్టిండు.. సంచలన వ్యాఖ్యలు చేసిన వీ హనుమంత్ రావు..

Congress Senior Leader V Hanumanth Rao Fires On Bhatti Vikramarka: తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ లో ఇప్పటికే వర్గపోరు ఉంటుందనే వార్తలు ఎల్లప్పుడు ప్రచారంలో ఉంటాయి. కొందరు కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లంతా, సీఎం అభ్యర్థులే అనుకుంటారని రాజకీయాల్లో చర్చ కొనసాగుతుంటుంది. ఇదిలా ఉండగా.. బహిరంగాంగానే కొందరు సీనియర్లు ఒకరిపై అవాకులు, చవాకులు పేల్చుకున్న సందర్భాలు కొకొల్లలు. ఇదిలా ఉండగా... కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో పెనుదుమారంగా మారాయి. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గతంలో రేవంత్ పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ బహిరంగ సభను సక్సెస్ చేశాడు.

Read More: Heavy Rainfall In Hyderabad: చల్లబడిన భాగ్య న'గరం'.. పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో వర్షం.. పవర్ కట్..

అంతేకాకుండా.. రాహుల్ గాంధీ పాదయాత్రలో కూడా ఎంతో యాక్టివ్ గా పాల్గొని, జనసమీకరణ చేయడంలో కీలక పాత్ర పొందాడు. దీంతో హైకమాండ్ నాయకుల దగ్గర రేవంత్ మంచి మార్కులు కొట్టేశాడు.దీన్ని బెస్ గా తీసుకుని కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు... తాను రేవంత్ రెడ్డికి సీఎం అయ్యే  అన్ని క్వాలిటీస్ ఉన్నాయని వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. ఇక.. అప్పటి నుంచి భట్టీ తనపై గుర్రుగా ఉన్నాడని,పగబట్టాడని వీ హనుమంత్ రావ్ అన్నారు. గతంలో భట్టీ అన్నకు టికెట్ ఇప్పిస్తే.. భట్టి తన కాళ్లుమొక్కాడని గుర్తు చేశారు. ఆయనను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది నేనే అంటూ గుర్తుచేశారు.

కానీ ఇప్పుడు మాత్రం.. కనీసం  ఆ కృతజ్ఞత కూడా లేకుండా భట్టీ ప్రవర్తిస్తున్నాడని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఖమ్మం ఎంపీ టికెట్ రాకుండా కుట్రలు చేస్తున్నారరని మండిపడ్డాడు.  భట్టీని ఉద్దేషించి ఇంత స్పీడ్ ఎక్కువైతే ఎట్లా అంటూ ఆయన ఎద్దేవా చేశారు.  ఇదిలా ఉండగా.. లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం ప్రస్తుతం రచ్చగా మారింది.

Read More: Chilkur Balaji: వెయ్యిరెట్లు భక్తులు ఎక్కువగా వచ్చారు.. గరుడ ప్రసాదంపై క్లారీటీ ఇచ్చిన ఆలయ పూజరీ..

దీనిపై అపోసిషన్ లీడర్లు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే  బీఆర్ఎస్ నాయకులు అనేక సందర్భాలలో.. సీఎం రేవంత్ కు పదవి గండం ఉందని, తమనుంచి ఎలాంటి ఆపదరాదని క్లారిటీ ఇచ్చారు. నల్లొండ, ఖమ్మం, ఆయన  చుట్టుపక్కల ఉన్న వారే రేవంత్ సీటును లాగేసుకొవడానికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఒక టికెట్ విషయంలో ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంపార్టీకీ నష్టం తెచ్చిపెడుతుందని పలువురు భావిస్తున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-04-20T08:43:51Z dg43tfdfdgfd