VAISHAKA MASAM 2024: వైశాఖ మాసంలో ఈ పనులు చేస్తే విష్ణుమూర్తి అనంతమైన సంపదలు కురిపిస్తాడు..

Vaishaka Masam 2024 Donate: వైశాఖ మాసం ప్రారంభం సందర్భంగా ఎలాంటి విధానాలు పాటించాలి. వైశాఖమాసంలో ఎలాంటి దానాలు ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో వైశాఖ మాసాన్ని మాధవ మాసం అనే పేరుతో కూడా పిలుస్తారు. విష్ణుమూర్తికి చాలా ఇష్టం అయినటువంటి ఈ వైశాఖ మాసంలో ప్రతి రోజూ స్నానం చేసిన తర్వాత రావి చెట్టు దగ్గరికి వెళ్లి నీళ్లు పోసి ప్రదక్షణాలు చేస్తే అనంతమైన సంపద లభిస్తుందని పద్మపురాణంలో ఉంది. ఈ కాలములలో తెలిసి తెలియక తులిసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే పునర్జన్మ ఉండదని అంటారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం విష్ణుమూర్తి తులసి దళాలతో పూజిస్తే అలాగే ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే ఈ వైశాఖ మాసంలో శివునికి ఏ అభిషేకం చేయాలి.

 అలాగే వైశాఖ మాసము అంటే దానాలకు ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ మాసంలో కొన్ని దానాలు ఇచ్చే అద్భుత ఫలితాలు వైశాఖ మాసం ఎండలో తిరిగి వచ్చిన అలిసిపోయిన వాళ్లకి మంచినీళ్లు ఇచ్చి విసనకర్రతో ఉన్నట్లయితే త్రిలోక సంచారం చేసిన ఫలితం కలుగుతుంది. ముల్లోకాలు తిరిగినా ఫలితం రావాలంటే ఎండలో తిరిగి వచ్చిన వాళ్లకు మంచినీళ్లు ఇచ్చి విసనకర్రతో విసరండి. అలాగే వైశాఖమాసంలో మజ్జిగ ,పెరుగు దానం ఇచ్చిన విద్యా ప్రాప్తి కలుగుతాయి.

 ఆర్థికంగా కలిసిరావాలంటే విద్యా రంగంలో రాణించాలంటే మజ్జిగ,పెరుగు వైశాఖమాసంలో ఎవరికైనా అలాగే ఈ మాటల్లో గొడుగు పాదరక్షలు దానం ఇచ్చే విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాల్లో మంచి వృద్ధిని సాధిస్తారు అలాగే మామిడిని ఎవరికైనా దానం చేస్తే మీ పితృదేవతలకి క్షేత్రంలో శ్రాద్ధకర్మలను చేసిన ఫలం కలుగుతుందని పురాణాలు చెప్తాయి. ఎప్పుడైనా మరణించిన వాళ్లకి దానం చాలా గొప్పది. క్షేత్రానికి వెళ్లి అక్కడ పిండప్రదానాలు చేసి పితృ దేవతలకు శక్తులు కలిగిన ప్రయోజనం రావాలంటే వైశాఖ మాసంలో పాణకంతో నిండిన కుండను ఎవరికైనా దానంగా ఇవ్వాలి.

ఇదీ చదవండి: అక్షయ తృతీయ రోజు ఈ ఒక్క పని చేస్తే సంవత్సరం పాటు రాజయోగం తథ్యం..

బెల్లం, దోసకాయ దానంగా ఇచ్చిన సర్వపాపాలు తొలగిపోతాయి. మామిడిపండ్లను ఎవరికైనా దానంగా ఇస్తే పితృ దోషాలు కానీ ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి. వైశాఖమాసంలో మామిడి పళ్ళు దానం ఇస్తే సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. దోషాలు అన్ని తొలగిపోతాయి. వైశాఖ మాసం ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. వైశాఖమాసంలో ఈ నియమాలు పాటిస్తే అష్టైశ్వర్యాలు నిత్యజీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 

ఇదీ చదవండి: అక్షయ తృతీయరోజు ఈ పనిచేశారో మీకు జీవితాంతం ఆర్థిక సంక్షోభమే..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-05-08T13:16:18Z dg43tfdfdgfd