VENKYANIL 3: వెంకీ, అనిల్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన వచ్చేసింది

VenkyAnil 3: వెంకీ, అనిల్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన వచ్చేసింది

విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో ఇప్పటికే F2, F3 సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ అండ్ కామెడి ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ రెండు సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దిల్ రాజు నిర్మాణ సంస్థలో వచ్చిన ఈ రెండు సినిమాలు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబట్టాయి. అందుకే.. వెంకీ, అనిల్ కాంబోలో సూపర్ హిట్ కాంబోగా మారింది. ఇప్పుడు మరోసారి ఈ కాబోలో తెరపైకి వస్తే ఎలా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ లెవల్ పీక్స్ ఉంటుంది కదా. 

అందుకే.. మరోసారి ఆడియన్స్ ను ఫుల్లుగా ఎంటర్టైన్ చేయడానికి ఈ కాంబో ఫిక్స్ అయ్యారు. తాజాగా ఈ ఇద్దరు కలిసి మరో సినిమా చేయనున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ సినిమాను కూడా దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును అనౌన్స్ చేస్తూ స్పెషల్ వీడియో కేసుల విడుదల చేశారు. ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్లెంట్  వైఫ్.. సారి ఎక్స్టార్డినరీ ట్రాంగులర్ క్రైం థ్రిల్లర్ తో మీ ముందుకు వస్తున్నాము. 2025 సంక్రాంతికి కలుద్దాం అంటూ.. చెప్పుకొచ్చారు. 

ఇవన్నీ చూస్తుంటే.. ఈసారి కూడా ఆడియన్స్ ను ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్ సబ్జెక్టు తో కడుపుబ్బా నవ్వించనున్నారని క్లియర్ గా క్లియర్ గా అర్థమౌతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించనుందని ఇప్పటికే వార్తలు వైరల్ అయినా సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.

©️ VIL Media Pvt Ltd.

2024-07-02T05:05:07Z dg43tfdfdgfd