VENU SWAMY: పవన్ కళ్యాణ్‌కి ఆ యోగం లేదు.. మళ్లీ సినిమాలకే అంకితం: వేణు స్వామి

ఓ వైపు పవన్ కళ్యాణ్.. పిఠాపురంలో గెలవడమే కాదు.. లచ్చా లచ్చన్నర మెజారిటీ అని జనసైనికులతో పాటు.. పవన్ కళ్యాణ్ కూడా కలలు కంటుంటే.. అతనికి రాజకీయ యోగం లేదని జోస్యం చెప్పారు ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు వేణు స్వామి.

‘‘పవన్ కళ్యాణ్‌‌కి ఏదైనా మంచి చెప్తే ఆయన గ్రహించరు. అసలు ఆయనకి మంచి చెప్పాలనుకున్న మగాడే లేడు. పవన్ కళ్యాణ్‌కి చెప్పే దమ్ము త్రివిక్రమ్‌కి మాత్రమే ఉంది. కానీ ఆయన చెప్పరు. నాదెండ్ల మనోహర్ చెప్పరు. పోనీ చిరంజీవి చెప్తారా అంటే.. ఆయన చెప్పినా పవన్ కళ్యాణ్ వినడు.. ఖతమ్ అయిపోయిందంటే.

ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో పెద్ద వ్యక్తి ఉండాలి. వాళ్ల మాట వినాలి. భర్తకి భార్య కూడా గురువే. భర్త భార్యకి గురువే. తల్లి,తండ్రి, అన్న, అక్క, చెల్లి వీళ్లంతా గురువులే. ఎవరొకరి మాట వినాల్సిందే. పెళ్లైంపైనో.. పిల్లలపైనో ప్రేమ ఉండాలి. ఎవరొకరి మాట వినాలి.

పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని నాకూ ఉంది. ఆయనంటే పిచ్చి. ఆయన సినిమాల్లో కనీసం 10 సినిమాలకు ముహూర్తం పెట్టాను. చాలాసార్లు ఆయనతో గంటలు గంటలు గంటలు కూర్చుని మాట్లాడా. అయితే ఇష్టం వేరు.. ఆయన అభివృద్ధిలోకి వస్తే చూడాలనే కాంక్ష వేరు. ఆయన బాగుపడాలనే కోరుకుంటా. జగన్ మోహన్ రెడ్డిని ఓడగొట్టి పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటా. ఆ తరువాత పవన్ కళ్యాణ్ ఓడించి ఇంకొకరు సీఎం కావాలి. అందరూ ఎదగాలనే కోరుకుంటా. కానీ పవన్ కళ్యాణ్‌లా చెడ్డపేరు తెచ్చుకోకూడదు.

పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో అవగాహనే లేదు. ఆయన నిర్ణయాలు చాలా బోల్డ్‌గా ఉంటాయి. కుటిల రాజకీయాలు ఆయనకి తెలియవు. కాబట్టే ఆయన ఫెయిల్ అవుతున్నారు. నేను ఆయనమంచికే చెప్తుంటా కానీ.. జనసైనికులు నన్ను ట్రోల్ చేస్తుంటారు. జగన్ మోహన్ రెడ్డి.. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు కోసం మాట్లాడినప్పుడు.. మూడు కాదు 30 పెళ్లిళ్లు చేసుకుంటాడని చెప్పాను. అప్పుడు మాత్రం జనసైనికులకు నచ్చుతాను. ఆహా ఓహో ఏం చెప్పారు గురువుగారు అంటూ ఆ వీడియోలను షేర్ చేస్తారు. కానీ ఏదైనా మంచి చెప్తే మాత్రం నచ్చదు. తిడతారు.. ట్రోల్ చేస్తారు.

పవన్ కళ్యాణ్‌కి సినిమాలకే అంకితం. ఆయన రాజకీయాలకు పనికిరారు. మన అంచనాలు 100 శాతం ఉంటే.. రిజల్ట్ 20 శాతమే ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాలపై ఫోకస్ పెడితే రాణిస్తాడు’ అంటూ చెప్పుకొచ్చారు వేణుస్వామి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-10T16:22:39Z dg43tfdfdgfd