VIJAY DEVARAKONDA: విజయ్ దేవరకొండతో మరోసారి దిల్‌ రాజు.. ఈసారి మాములుగా ఉండదట

విజయ్ దేవరకొండకి ప్రస్తుతం హిట్ కొట్టడం చాలా అవసరం. ఎందుకంటే 'గీత గోవిందం' తర్వాత విజయ్ కెరీర్‌లో సరైన బ్లాక్ బస్టర్ పడలేదు. ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన 'ఫ్యామిలీ స్టార్' కూడా నిరాశపరిచింది. గీత గోవిందం డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం గత నెల 5న థియేటర్లలో రిలీజై భారీగా నెగెటివిటీ తెచ్చుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్‌కి గురైంది. దీని నుంచి కోలుకునే లోపే విజయ్‌తో మరో చిత్రాన్ని ప్రకటించి అందరికీ షాకిచ్చారు దిల్ రాజు.

ఆ డైరెక్టర్‌తో

విజయ్ దేవరకొండతో ఓ రూరల్ యాక్షన్ డ్రామా చేస్తున్నట్లు దిల్ రాజు ప్రకటించారు. 'రాజా వారు రాణి గారు' ఫేమ్ రవికిరణ్ కోలా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ యంగ్ డైరెక్టర్ 'అశోక వనంలో అర్జున కళ్యాణం' చిత్రానికి స్క్రీన్ రైటర్‌గా కూడా పనిచేశారు. ఇలాంటి డైరెక్టర్‌తో విజయ్ దేవరకొండ కొత్త సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి శిరీష్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇక మే 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం గురించి బిగ్‌ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమాతోనైనా విజయ్ హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.

ఈ సినిమాపై

ప్రస్తుతం విజయ్ 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న ప్రాజెక్ట్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో పోలీసు పాత్రలో కనిపించబోతున్నాడు రౌడీ. ఇటీవల ఈ చిత్రం గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అయింది. తన కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని ఓ కొత్త ప్రయోగం ఈ చిత్రం కోసం విజయ్ చేస్తున్నాడని టాక్. ఈ సినిమాలో ఒక్క పాట కూడా ఉండదట. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లడానికి అనిరుధ్ మ్యూజిక్ ఒకటి చాలని విజయ్ నమ్ముతున్నాడట. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకే హైలైట్ అవుతుందని మూవీ టీమ్ అనుకుంటుంది. అందుకే ఈ ప్రాజెక్టులో పాటలు లేకుండానే ప్లాన్ చేస్తున్నారట. దీంతో ఈ చిత్రంలో ఒక్క పాట కూడా ఉండదని సమాచారం. గతంలో కార్తీ నటంచిన 'ఖైదీ' సినిమాలో కూడా పాటలు ఉండవు. ఇప్పుడు అదే బాటలో విజయ్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పాన్-ఇండియన్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-04T07:17:56Z dg43tfdfdgfd