VIRAL VIDEO: అమాయకుల ప్రాణాలు తీయడం కరెక్ట్ కాదు: సజ్జనార్ వీడియో పోస్ట్ వైరల్

TGSRTC MD Sajjanar Shares Video of Road Accident | అమాయకుల ప్రాణాలు హైదరాబాద్: అప్పటివరకూ ఎంతో ఆరోగ్యంగా కనిపించినా, ఏ క్షణాన ఎవరి ప్రాణాలు ఎలా పోతాయో ఎవరూ చెప్పలేరు. కొందరు చిన్న విషయాలకు జీవితంలో ఓడిపోయామంటూ ఆత్మహత్య చేసుకుంటుంటే.. మరికొందరు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని సందర్భాలలో ఇతరి ప్రాణాలు తీస్తున్నారు. అలాంటి ఓ ఘటనపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు.

‘ఒకరి నిర్లక్ష్యపు డ్రైవింగ్ కు మరొకరి ప్రాణం బలైంది. కారుతో పాదచారుడిని ఢీకొట్టి కనీసం మానవత్వం లేకుండా తనకేం పట్టనట్టుగా కారు డ్రైవర్ వెళ్లిపోయాడు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఈరోజు జరిగిన ఈ ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందారు. రోడ్లపైకి వాహనాలతో వచ్చి ఇష్టారీతిన నడుపుతూ  అమాయకపు ప్రాణాలను తీయడం ఎంత వరకు సమంజసం!?’ అని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ వీడియో పోస్ట్ చేశారు. ప్రజల ప్రాణాలు విలువైనవి అని, నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేసి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను బలిగొనడం సమంజసం కాదని తరచూ సజ్జనార్ ఎక్స్ ఖాతాలో వీడియోలు, సమాచారం పోస్ట్ చేస్తుంటారు. తాజాగా సజ్జనార్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 

2024-07-02T10:11:04Z dg43tfdfdgfd