VIRAL VIDEO: జెండా ఊపుతున్న చిన్నారిని చూసి ఆగిపోయిన పవన్- జనసైనికులు స్టాటస్ పెట్టుకునే వీడియో

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఈ టూర్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పవన్ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు ఓ బాలుడు రోడ్డుపక్కనే జెండా ఊపుతూ కనిపించాడు. ఆ బాలుడిని చూసిన పవన్ కల్యాణ్ వెంటనే కారు ఆపేసి దిగారు. బాలుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. 

పవన్  ఆ బాలుడిని పట్టుకుంటున్న టైంలో సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అడ్డుకున్నారు. సిబ్బందిని వారించిన పవన్ కల్యాణ్‌ బాలుడితో ఫొటో దిగారు. ఆయనతో మాట్లాడి మళ్లీ కారు ఎక్కి వెళ్లిపోయారు. కేవలం 25 సెకన్లు ఉన్న ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. 

అలా ముందుకు వెళ్లిన పవన్ కు కొందరు ప్రజలు ఎదురొచ్చారు. వారిని చూసిన డిప్యూటీసీఎం కారు ఆపి వాళ్ల సమస్యలు కూడా తెలుసుకున్నారు. ఈ రెండు వీడియోలు జనసైనికులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. రెండు రోజులుగా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్‌ కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటున్నారాని కామెంట్స్‌ చేస్తున్నారు

2024-07-03T08:19:13Z dg43tfdfdgfd