VIRAL: మాజీ ప్రియుడిపై యువతి రివెంజ్.. అతని తండ్రిని పెళ్లి చేసుకుని సవతి తల్లిగా ఎంట్రీ!

Viral Video: ప్రేమ గొప్పతనం గురించి చెప్పేందుకు చాలా మంది ప్రేమకు హద్దులు లేవు అనే మాట ఉపయోగిస్తుంటారు. నచ్చిన వారిపై అంతులేని ప్రేమను చూపించడం, వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడటం ద్వారా కొందరు ఆ మాటను నిజం చేస్తారు. కానీ దీనికి పూర్తి విరుద్ధంగా జరిగిన ఓ సంఘటన నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓ అమ్మాయి, తన ఎక్స్‌బాయ్‌ఫ్రెండ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎవ్వరూ ఊహించని పని చేసింది. ప్రేమకు కాదు, ప్రతీకారానికి హద్దులు లేవని నిరూపించింది. ఇంతకీ ఆమె ఏం చేసిందబ్బా అనుకుంటున్నారా?

ఎక్స్ లవర్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఒక అమ్మాయి ఎంచుకున్న మార్గం చూసి అందరూ అవాక్కవుతున్నారు. తన మాజీ ప్రియుడి మీద కోపంతో అతని తండ్రిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. తద్వారా ఎక్స్ లవర్‌కు సవతి తల్లిగా వెళ్లి రివెంజ్ తీర్చుకోవాలని భావించింది.

* మాజీ ప్రియుడికి తల్లిగా ఎంట్రీ

ఈ షాకింగ్‌ విషయాలను ఎక్స్‌ బాయ్‌ఫ్రెండ్‌ సోదరి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. తన సోదరుడి బ్రేకప్‌ తర్వాత జరిగిన ఊహించని ఘటనలను పోస్టు చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. తన సోదరుడిపై అతని ప్రియురాలు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది.

బ్రేకప్‌లో బాయ్‌ఫ్రెండ్‌ గురించి బాధపడుతూ మాట్లాడటం, ఎమోషనల్ డ్రామాలకు బదులు ఆమె అసాధారణమైన మార్గాన్ని ఎంచుకుంది. ఎక్స్‌ బాయ్‌ఫ్రెండ్‌ తండ్రిని పెళ్లి చేసుకుని వారి కుటుంబంలో భాగమైంది. మాజీ ప్రియుడికి సవతి తల్లి స్థానం పొందింది. తర్వాత అతడిపై రివెంజ్ తీర్చుకుంది. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఓ టిక్‌టాక్‌ వీడియో ద్వారా ఈ వివరాలు తెలుసుకున్న సోషల్‌ మీడియా యూజర్లు షాక్‌ అవుతున్నారు.

---- Polls module would be displayed here ----

* పెళ్లి పెద్ద పాత్రలో హల్‌చల్‌

చివరికి ఎక్స్‌బాయ్‌ఫ్రెండ్‌ పెళ్లికి అడ్డంకులు సృష్టించేందుకు సైతం ఆమె ప్రయత్నించింది. పెళ్లిలో సవతి తల్లిగా తన హక్కులను గౌరవించాలని పట్టుబట్టింది. తనకు అన్ని వివరాలను ముందుగా చెప్పాలని స్పష్టం చేసింది.

* అసలు సిసలైన రివెంజ్

చివరకు ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ పెళ్లి రోజు సవతి తల్లి రచ్చ రచ్చ చేసింది. పెళ్లి రోజున, సంప్రదాయం ప్రకారం వధువు మాత్రమే తెల్లటి దుస్తులు ధరించాలి. అతిథులు, కుటుంబ సభ్యులు రంగురంగుల దుస్తులను ధరించారు. అయితే సవతి తల్లి, తన మాజీ ప్రియుడిని (పెళ్లి కొడుకును) ఇబ్బంది పెట్టేందుకు, హింసించేందుకు, ఊహించని పని చేసింది. ఆమె కూడా వధువుతో పాటు తెల్లటి దుస్తులను ధరించింది. అంతటితో ఆగకుండా, ప్రతి ఫ్యామిలీ ఫోటోలోనూ ఉండాలని ఆమె పట్టుబట్టింది. తన చేష్టలతో మాజీ ప్రియుడిని ఒక ఆట ఆడుకుంది. దీంతో వారి కుటుంబం మొత్తం ఇబ్బంది పడింది.

సమ్మర్ లో టూర్ కి వెళ్లాలనుకుంటే ఈ హిల్ స్టేషన్ కి వెళ్లండి..స్వర్గంలో ఉన్నట్లే!

* సోషల్‌ మీడియాలో కామెంట్లు

బాధితుడి సోదరి టిక్‌టాక్ వీడియో బయటకు రావడంతో ఈ కథ వెలుగులోకి వచ్చింది. రివెంజ్ తీర్చుకున్న యువతి, ఎక్స్‌బాయ్‌ఫ్రెండ్‌ను తన కొడుకుగా పేర్కొంటూ, ‘మీ సవతి కొడుకు (మాజీ ప్రియుడు)తో మీరు ఇంకా ప్రేమలో ఉన్నారని ప్రజలు భావించినప్పుడు’ అని ఆమె వీడియోకు క్యాప్షన్ యాడ్‌ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ప్రతీకారం ఎక్కడా చూడలేదని, ఇలా కూడా చేస్తారా? అని కామెంట్లు పెడుతున్నారు.

2024-04-19T12:05:21Z dg43tfdfdgfd