VOICE CHANGES: వయసు పెరుగుతున్న కొద్ది గొంతు ఎందుకు మారుతుందో తెలుసా..?

Voice Changes: చాలా ఏళ్ల తర్వాత ఎవరినైనా కలిస్తే.. చాలా మారిపోయావే? అనే ప్రశ్న తరచూ ఎదురవుతుంది. వయస్సు పెరిగే కొద్దీ మన శరీరంలో, ఆలోచన విధానంలో చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా గొంతు ఊహించని విధంగా మారుతుంది. సన్నని టోన్ నుంచి మెచ్యూర్‌ సౌండ్‌కి మారుతుంది. అయితే వాయిస్‌(Voice)లో ఇంత మార్పు ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఇదే ప్రశ్నను ఓ యూజర్‌ పబ్లిక్ నాలెడ్జ్ షేరింగ్, క్వశ్చనింగ్ ప్లాట్‌ఫామ్‌ కోరా(Quora)లో పోస్టు చేశారు. దీనికి సమాధానం తెలుసుకోండి.

* వయసు పెరిగితే వచ్చే మార్పు..

వార్తా సంస్థ BBC నివేదిక ప్రకారం.. మన వాయిస్‌ను ప్రొడ్యూస్‌ చేయడంలో స్వర తంతువులు(వోకల్ కార్డ్స్‌) కీలక పాత్ర పోషిస్తాయి. శ్వాసకోశ వ్యవస్థలో గొంతు నుంచి ఊపిరితిత్తులకు గాలిని పంపడానికి ఉపయోగపడే స్వరపేటికలో వోకల్ కార్డ్స్‌ ఉంటాయి. ఊపిరితిత్తుల నుంచి గాలి స్వరపేటిక గుండా వెళుతున్నప్పుడు, అది వోకల్ కార్డ్స్‌లో వైబ్రేషన్స్‌ క్రియేట్‌ చేస్తుంది, దీని ద్వారా సౌండ్‌ ప్రొడ్యూస్‌ అవుతుంది.

హిందూ టెంపుల్ లో ముస్లింలకు ఇఫ్తార్ విందు.. మతసామరస్యానికి ప్రతీకగా 40ఏళ్లుగా సేవ

* వాయిస్‌ ఎలా మారుతుంది?

వోకల్‌ కార్డ్స్‌లో మూడు ప్రధాన భాగాలు గాత్ర కండరం(Vocalis Muscle), స్వర స్నాయువు(Vocal Ligament), రక్షిత గ్రంధులతో కూడిన శ్లేష్మ పొర-స్వర తంతువులు ఉంటాయి. ఇవి ఉపరితల తేమను మెయింటెన్‌ చేస్తాయి, దెబ్బతినకుండా కాపాడతాయి. అలాగే స్వరపేటికలో సుమారు 17 కండరాలు ఉంటాయి, ఇవి స్వర తంతువుల పొజిషన్‌, టెన్షన్‌ అడ్జస్ట్‌ చేయడం ద్వారా, ప్రొడ్యూస్‌ అయిన సౌండ్‌ను మారుస్తాయి.

Shani in Badrapada: ఈ 6 రాశుల వారికి గడ్డు కాలం.. మీరు నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తే నో వర్రీస్

* ఆడవాళ్లదే పెద్ద వాయిస్‌

యుక్తవయస్సుకు ముందు, స్వర తంతువుల ద్వారా ఉత్పత్తి అయిన మగ, ఆడవారి స్వరాలలో కనీస అసమానత ఉంటుంది. యుక్తవయస్సు ప్రారంభంతో, హార్మోన్ల మార్పులు జరుగుతాయి. మగవారిలో ఈ మార్పులు స్వరపేటికలో నిర్మాణ మార్పులను కలిగి ఉంటాయి. ఆడమ్ యాపిల్ అభివృద్ధి చెందుతుంది, స్వర పేటిక పొడవు పెరుగుతుంది.

* స్వర తంత్రులు పెరగడమే కారణం..

యుక్త వయస్సు తర్వాత, మగవారి స్వర తంత్రులు సాధారణంగా 16 మిమీ (0.63 అంగుళాలు), ఆడవారిలో అవి 10 మిమీ (0.39 అంగుళాలు) ఉంటాయి. యుక్త వయస్సు తర్వాత, స్త్రీ స్వర తంతువులు 20 నుంచి 30 శాతం వరకు సన్నగా ఉంటాయి. చిన్న, సన్నగా ఉండే స్వర తంతువుల కారణంగా, పురుషులతో పోలిస్తే మహిళలు హయ్యర్‌-పిచ్డ్‌ వాయిస్‌ కలిగి ఉంటారు.

* హార్మోన్ల హెచ్చు తగ్గుల వల్లే..

అయితే యుక్తవయస్సు వచ్చిన తర్వాత కూడా హార్మోన్ల హెచ్చుతగ్గులు మన స్వరాలను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. స్త్రీ స్వరం వారి రుతుచక్రం దశను బట్టి మారవచ్చు. అండోత్సర్గ దశ స్వర నాణ్యతతో ముడిపడి ఉంటుంది. ఈ దశలో, గ్రంధుల ద్వారా పెరిగిన శ్లేష్మ ఉత్పత్తి స్వర తంతు పనితీరును మెరుగుపరుస్తుంది, ఫలితంగా ధ్వని నాణ్యత మెరుగుపడుతుంది.

* వాయిస్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది..

గొంతు ఓ దశలో ఆగిపోతుందని చెప్పలేం. మన వాయిస్‌లు జీవితాంతం గణనీయమైన మార్పులకు లోనవుతూనే ఉంటాయి. యుక్తవయస్సు, హార్మోన్ల హెచ్చుతగ్గుల వంటి కారకాలతో మన గొంతు ఎక్కువ ప్రభావితమవుతుంది. జీవశాస్త్రం, వాయిస్ మాడ్యులేషన్ మధ్య ఉన్న సంక్లిష్టమైన సంబంధంపై సోషల్‌ మీడియాలో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

2024-03-29T12:36:34Z dg43tfdfdgfd