YASH-KAREENA KAPOOR: పాన్ ఇండియా స్టార్ యశ్కి..బ్యూటీ కరీనా సిస్టర్ పాత్రలోనా!

Yash-Kareena Kapoor: పాన్ ఇండియా స్టార్ యశ్కి..బ్యూటీ కరీనా సిస్టర్ పాత్రలోనా!

స్టార్ హీరో యశ్‌ (Yash) కెరిర్ లో 19వ సినిమాగా టాక్సిక్ (Tixic) అనే మూవీ వస్తున్న విషయం తెలిసిందే. కేవీఎన్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) డైరెక్ట్ చేయబోతున్నారు. భారీ స్థాయిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి క్రేజీ న్యూస్ ఒకటి వినిపిస్తోంది.

అదేంటంటే..ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ యశ్‌కి జోడిగా నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది. అందులో ఒకటి బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, శృతి హాసన్ అంటూ వార్తలు వస్తున్నాయి. 

Also Read:యానిమల్ పాత్ర అంత ఫేమస్ అవడానికి కారణం చెప్పిన గ్లామర్ బ్యూటీ

లేటెస్ట్గా ఈ సినిమా నుంచి మరో న్యూస్ వైరల్ అవుతుంది. వైరల్ అవ్వడమే కాదు..అది ఓ రకంగా షాకింగ్ న్యూస్ అయింది. అదేంటంటే..ఈ సినిమాలో క‌రీనా న‌టించేది యశ్కి జోడీగా కాదట..సిస్ట‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తుందంటూ కొత్త టాక్ మొదలైంది. దీంతో యశ్ ఫ్యాన్స్ తో సినీ లవర్స్ కూడా డైజెస్ట్ చేసుకోవటం లేదట.

మొదట పాన్ ఇండియా స్టార్ యశ్కి గ్లోబల్ బ్యూటీ కరీనా జోడీగా నటిస్తుందని మస్తు ఖుషి అయ్యారు. ఇంకా లేటెస్ట్ టాక్ తో భయపడిపోతున్నారు. త్వరలో హీరోయిన్గా నటించేదెవరో..సిస్టర్ పాత్ర చేసేదెవరో తెలిసే అవకాశం ఉంది.

టాక్సిక్ సినిమా విషయానికి వస్తే..ఇదొక తోబుట్టువ‌ల క‌థ అని..య‌శ్ సోద‌రి పాత్ర‌లోనే క‌రీనా న‌టిస్తుంద‌ని..జోడీగా కాదంటూ  టాక్ వినిపిస్తోంది.అక్కా-తమ్ముడు సెంటిమెంట్ నేప‌థ్యంలో భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా డైరెక్టర్ గీతూ మ‌లుస్తున్న‌ట్లు తెలుస్తోంది. 

రీసెంట్గా రిలీజ్ చేసిన గ్లింప్స్‌‌ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది.  ఏప్రిల్ 10, 2025న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఈ వీడియోలో తెలిపారు. ఈ ఒక్క వీడియో సినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలను పెంచేసింది. మరి కేజీఎఫ్ తరువాత యశ్‌ నుండి వస్తున్న ఈ సినిమా ఎన్ని కొత్త రికార్డ్స్ క్రియెస్ట్ చేస్తుందో చూడాలి.

©️ VIL Media Pvt Ltd.

2024-03-28T09:56:38Z dg43tfdfdgfd