అందాల ఆరబోతలో అక్కను మించిన చెల్లి.. సోషల్ మీడియాలో జాన్వీ సోదరి రచ్చ.. పిక్స్ వైరల్..

జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ సరసన ఎన్టీఆర్ 30లో నటిస్తున్నసంగతి తెలిసిందే.  ఈ సినిమా  షూటింగ్‌ ప్రస్తుతం జరుగుతోంది. ఈ మూవీ ద్వారా ఆమె తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు.  Photo : Instagram
ఈ సినిమాలో జాన్వీ కపూర్  మత్స్యకారుని కూతురిగా కనిపిస్తోందని.. జాన్వీ లుక్ కూడా చాలా వరకూ లంగా ఓణిలో ఉంటుందని టాక్. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ మరోసారి ఆర్ ఆర్ ఆర్ తర్వాత ట్రైబల్ లుక్‌లో కనిపించనున్నారని, ఈ సినిమాలో జాన్వీ పాత్ర పేరు తంగం అని తెలుస్తోంది..  Photo : Instagram
ఇక జాన్వీ సోదరి ఖుషి కపూర్ విషయానికి వస్తే.. ఆమె 2000 నవంబరు 5న జన్మించింది. శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు రెండో సంతానం. ముంబైలోని ధీరూబాయ్ అంబానీ స్కూల్‌లో ఖుషి కపూర్ విద్యాభ్యాసం పూర్తిచేసింది.
లండన్‌ ఫిలిం స్కూల్లో నటనలో శిక్షణ తీసుకుంది. ఆర్చీస్ కామిక్స్ సిరీస్‌ ఆధారంగా 2023లో వచ్చిన ది ఆర్చీస్‌ మూవీలో సుహానా ఖాన్, రోహిత్ చెత్రీలతో పాటు ఖుషి కపూర్ నటించింది. ఈ సినిమాకు జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఖుషి తెలుగులో ఉప్పెన హిందీ రీమేక్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్‌ను బోణీ కపూర్ దక్కించుకున్నారు. అందులో భాగంగా ఆయన స్వయంగా ఈ సినిమాను నిర్మించనునన్నారట. త్వరలో ఈ విషయంలో ఓ ప్రకటన రానుంది.
ఇక ఖుషీ సోదరి జాన్వీ దేవరతో పాటు తెలుగులో మరో సినిమాలోను నటిస్తోంది. రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో ఓ వార్త వైరల్ అవుతుండగా.. ఆమె చివరకు ఖరారు అయ్యింది. Photo : Instagram
చాలా పేర్లు పరిశీలించిన టీమ్ చివరకు జాన్వీని ఓకే చేసింది. అయితే ఈ సినిమాకు ఈ భామ 6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను ఆమధ్య జరిగిన సంగతి తెలిసిందే. Photo : Instagram
ఈ సినిమా కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుందని అంటున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌లో పనుల్లో ఉంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రల్లో నటిస్తాడని, ఒక హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌‌ను, మరో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్‌‌ని తీసుకుంటారని టాక్. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో. Photo : Instagram
ఇక అది అలా ఉంటే జాన్వీ ఆదాయం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2022 సంవత్సరం వరకు ఆమె సంపద విలువ $10 మిలియన్‌ వరకు ఉంటుందని తెలుస్తోంది. అంటే భారతీయ రూపాయలలో నికర విలువ రూ. 82 కోట్లుగా ఉండనుంది. ఇక జాన్వీ నెలవారీ ఆదాయం 0.5 కోట్లుగా వార్షిక ఆదాయం 6 నుంచి 8 కోట్లకు ఉంటుందని అంటున్నారు. Photo : Instagram
జాన్వీ ముంబైలోని జుహు ప్రాంతంలో 39 కోట్ల రూపాయలతో ఓ ఖరీదైన ఇంటిని సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇండస్ట్రీకి వచ్చింది 2018లో.. చేసింది. కానీ అప్పుడే 40 కోట్లు పెట్టి ఇల్లు కొనేసింది అంటే జాన్వీని చూసి అంతా షాక్ అవుతున్నారు. జాన్వీ కొత్త ఇల్లు జుహులో మూడు అంతస్తులలో ఉంది. ఈ ఇంటి విస్తీర్ణం మొత్తం 3,456 చదరపు అడుగులు ఉంటుందట.. Photo : Instagram.

2024-03-28T08:58:58Z dg43tfdfdgfd