అచ్చం సింహం లాగానే గర్జిస్తున్న ఐదేళ్ల చిన్నారి.. వీడియో వైరల్

సాధారణంగా చిన్న పిల్లలు చాలా అల్లరి చేస్తూ జీవితాన్ని సంతోషంగా గడిపేస్తుంటారు. ఎప్పుడూ కుతూహలంగా ఉండే వీళ్లు వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడానికి ఇష్టపడతారు. వివిధ శబ్దాలను వింటూ వాటిని ఇమిటేట్ చేయడానికి ట్రై చేయడం మీరు చూసే ఉంటారు. పిల్లలు జంతువుల శబ్దాలను కూడా ఇమిటేట్ చేయడానికి చాలా ఇష్టపడతారు. అయితే ఒక చిన్నారి జంతువుల శబ్దాలను అనుకరించడంలో నైపుణ్యం సాధించింది. చూసేందుకు చాలా క్యూట్‌గా ఉన్న బాలిక అచ్చం సింహం (Lion) లానే గర్జించి (Roar) భయపెట్టగలదు.

ఈ బాలిక సింహంలా గర్జించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కళ్లు మూసుకొని ఈ చిన్నారి ఇమిటేషన్ వింటుంటే నిజంగా సింహం గర్జించినట్లే అనిపిస్తోంది. అందుకే ఈ వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

https://twitter.com/i/status/1783545350621425941

ఈ వైరల్ క్లిప్‌లో కనిపిస్తున్న చిన్నారి పేరు రిలీ కే స్కాట్. రిలీ తల్లి అమీ తన కూతురి అల్లరి పనులను సోషల్ మీడియాలో తరచుగా పంచుకుంటుంది. సింహం మాదిరిగానే ఎలా గర్జించగలిగావు? అని అడిగితే... "ముందుగా గాలి పీల్చుకొని, ఆపై శబ్దం చేస్తూ గాలిని వదిలివేస్తాను." అని రిలీ చెబుతోంది. రిలీ చాలా రోజుల ప్రాక్టీస్‌తో ఈ నైపుణ్యాన్ని నేర్చుకుంది.

ఈ వీడియోను ప్రముఖ మైక్రోబ్లాకింగ్ సైట్ ఎక్స్‌ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రకారం, ఈ చిన్నారి వయస్సు ఐదు సంవత్సరాలు మాత్రమే. ఆమె వీడియో ఏప్రిల్ 25న షేర్ చేయగా ఇప్పటివరకు 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. రిలీ సింహంలా గర్జించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. "నేను ఇప్పుడే ఒక చిన్న పిల్ల సింహంలా గర్జించే టిక్‌టాక్ వీడియో చూశాను. బాలిక సింహం పిల్లలా కాదు, ఒక నిజమైన పెద్ద సింహంలా గర్జించింది. ఆమె వయస్సు ఐదు సంవత్సరాలు మాత్రమే అంటే నమ్మలేకపోతున్నా??" అని ఈ వీడియోకు ఓ క్యాప్షన్ జోడించారు.

నెటిజన్ల రియాక్షన్

ఈ వీడియో విస్తృతంగా వైరల్ అవుతూ చాలామంది రియాక్షన్లను అందుకుంటారు. చిన్న పిల్లలకు నేర్చుకునే సామర్థ్యం చాలా ఎక్కువ అని, వారు ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే దాన్ని సులభంగా నేర్చుకోగలుగుతారని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. తల్లిదండ్రులు పిల్లలకు కొత్త విషయాలను నేర్పిస్తూ ఉండాలని, జీవితంలో ఏదైనా సాధించగలమనే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని మరికొందరు సూచించారు. చిన్నప్పుడే వారికి ఉపయోగకరమైన నైపుణ్యాలు నేర్పిస్తే పెద్దయ్యాక ధన్యవాదాలు తెలుపుకుంటారని ఇంకొందరు అన్నారు.

గతజన్మలో ఆడ సింహమా?

"ఆ చిన్న పిల్ల గత జన్మలో ఆడ సింహం అయి ఉండాలి, అదే నిజం!" అని ఒక యూజర్ కామెంట్ చేయగా.. "ఆమె సింహం గర్జన శబ్దాలను క్రియేట్ చేసే ఫిల్మ్ కంపెనీలో పని చేయాలి. గర్జన అంత బాగుంది!" అని మరో యూజర్ అన్నారు. "ఈ వీడియో చూశాక నేను రిలీ టిక్‌టాక్ అకౌంట్ చెక్ చేశా. చాలా సేపు ఆమె వీడియోలను చూస్తూ గడిపాను. ఆమె చాలా చురుకైనది, తెలివైనది, చిన్నారి తల్లి చాలా అందంగా ఉంది, ఆమె చిన్న చెల్లెలు 'వాట్స్‌ థిస్?' అడగటం చాలా అనిపిస్తుంది." అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.

2024-04-27T07:10:03Z dg43tfdfdgfd