అడవికి రాజు గర్జించే సమయం ఆసన్నమైంది.. డిస్నీ ముఫాసా వచ్చేస్తోంది..

బ్లాక్ బస్టర్ లెగసీ మళ్ళీ ప్రారంభం అయ్యింది.. ప్రఖ్యాత స్టూడియో డిస్నీ నుంచి లయన్ కింగ్  ప్రీక్వెల్‌గా.. ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) వస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 20న భారీగా విడుదల కానుంది. ఈనేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ముఖ్యంగా ప్రైడ్ లాండ్స్ లో ముఫాసా ఎలా ఎదిగింది.. ఎలా ఆ కింగ్ డమ్‌కు రాజుగా మారలేకపోయింది.. ముఫాసా చిన్నతనంలో అసలు ఏం జరిగింది.. అనేది ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ‘ది లయన్ కింగ్’ (The Lion King) సినిమాకి ఓ రేంజ్‌లో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే.  1994లో వచ్చిన యానిమేషన్ సినిమా నుండి ఇక లేటెస్ట్‌గా రియలిస్టిక్ యానిమేషన్‌లో 2019లో వచ్చిన సినిమా వరకు ఎంతో ఆదరణ పొందింది . ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో బంపర్ హిట్ అయ్యింది.

ఇక లయన్ కింగ్‌కు ప్రీక్వెల్‌గా ఇప్పుడు ‘కింగ్ : ముఫాసా’ కథని బేస్ చేసుకుని ప్రైడ్ లాండ్స్ లో ముఫాసా ఒక రాజుగా ఎలా ఎదిగాడు అనే కథాంశం ఈ కొత్త చిత్రం రానుంది. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకానుంది.

అందులో భాగంగా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉన్న సినిమా కాబట్టి ప్రేక్షకుల నుండి ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలలో మంచి రెస్పాన్స్ ఈ ట్రైలర్ కు లభించింది.

ఈ చిత్రాన్ని బ్యారీ జెంకిన్స్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రేక్షకులకి రియలిస్టిక్ ఫీలింగ్ కలిగేలా లైవ్ యాక్షన్ ఫిలిం మేకింగ్ టెక్నిక్స్ని ఫోటో రియల్ కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెరీలో తీశారు. ఈ మానియాని ఎంజాయ్ చెయ్యడానికి డిసెంబర్ 20 వరకు వేచి చూడాల్సిందే.

2024-04-29T17:04:25Z dg43tfdfdgfd