అమరేంద్ర బాహుబలిగా MS ధోనీ.. ఆసక్తికరంగా 'బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్' యానిమేషన్

అమరేంద్ర బాహుబలిగా MS ధోనీ.. ఆసక్తికరంగా 'బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్' యానిమేషన్

భారత మాజీ సారథి ఎంఎస్ ధోని అపారమైన ప్రజాదరణ గురించి అందరికీ విదితమే. కీపర్‌గా/ బ్యాటర్‌గా/ నాయకుడిగా.. భారత క్రికెట్‌లో అతనిది చెరగని ముద్ర. మైదానంలో అతని నడవడిక, జట్టు సంక్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు అతని రచించే వ్యూహాలు ఎప్పటికీ మరువలేనివి. మహేంద్రుడు పేరు వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అదీ అతని పాపులారిటీ. అంతటి గొప్ప క్యారెక్టర్‌ని.. తెలుగు ఇండస్ట్రీలో జక్కన్నగా పేరొందిన ఎస్ఎస్ రాజమౌళి తనదైన శైలిలో ప్రశంసించారు.  

ఇటీవల హైదరాబాద్‌లో 'బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్' యానిమేషన్ సిరీస్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఓ పాత్రికేయుడు.. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి ఆసక్తికర ప్రశ్న సంధించారు. "బాహుబలి క్యారెక్టర్‌ ఫేస్‌ డిజైన్‌ ధోనీలానే ఉంది.. ఎంఎస్‌ ధోనిని ప్రేమించడమేనా?." అని ప్రశ్నించాడు. అందుకు రాజమౌళి చక్కని చిరునవ్వుతో సారూప్యతను అంగీకరించాడు. "బహుశా క్యారెక్టర్ క్రియేటర్స్ కూడా నాలాంటి ఆయన(ధోని) అభిమానులే కావచ్చు.." అని రాజమౌళి స్పందించారు.

రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రం 2015లో మొదటి భాగాన్ని విడుదల చేసినప్పటి నుండి ఒక కల్ట్ చిత్రంగా మారింది. ఈ చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా భారతీయ సినిమాకు కొత్త కోణాన్ని అందించాయి.

ప్లేఆఫ్ రేసులో CSK

ఇక ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ విషయానికొస్తే.. రుతురాజ్ సేన ఇప్పటివరకూ 11 మ్యాచ్‌ల్లో తలపడగా ఆరింట విజయం సాధించింది. 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. లీగ్ దశలో వీరింకా మూడు మ్యాచ్ లు ఆడాల్సివుండగా.. రెండింట విజయం సాధించినా ప్లే ఆఫ్స్ చేరవచ్చు. చెన్నై తమ తదుపరి మ్యాచ్‌లో మే 10న అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.

©️ VIL Media Pvt Ltd.

2024-05-09T10:35:53Z dg43tfdfdgfd