అమ్మమ్మ ఆశీర్వదించింది.. మనవడు పదిలో బెస్ట్ ర్యాంక్ సాధించాడు !

కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తెలంగాణ వ్యాప్తంగా గురుకుల ప్రభుత్వ పాఠశాలలు ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పదవ తరగతి ఫలితాల్లో గురుకుల పాఠశాల విద్యార్థులు తమ సత్తా చాటారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని అంజనీ నగర్ కు చెందిన గోవిందు దేవయ్య, దేవమ్మల మనవడు జక్కని హర్షవర్ధన్ పదవ తరగతి ఫలితాల్లో 9.8 GPA సాధించారు. వేములవాడ పట్టణ శివారులోని అయ్యప్ప టెంపుల్ సమీపంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నానని విద్యార్థి హర్షవర్ధన్ తెలిపారు. ఉపాధ్యాయులతో పాటు కుటుంబ సభ్యులు అమ్మమ్మ, తాతయ్య, మామయ్యల ప్రోత్సాహంతో పదవ తరగతిలో 9.8 GPA తో ఉత్తీర్ణత సాధించానని, తల్లిదండ్రులు దూరం ఉన్న కారణంగా..  చిన్నతనం నుంచి అమ్మమ్మ, తాతయ్య వద్దే ఉంటూ చదువుకుంటున్నానన్నారు.

డ్రైవరన్న కుమార్తెకు.. పదిలో బెస్ట్ ర్యాంక్ !

తన అమ్మమ్మ, తాతయ్య, మామయ్యలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా 9.8 GPA సాధించడం చాలా సంతోషంగా ఉందని, ఉపాధ్యాయులతో పాటు కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా కృతజ్ఞతా భావంతో ఉంటానని తన గురుభక్తిని చాటారు హర్షవర్ధన్. తాను భవిష్యత్ లో ఆస్ట్రాలజిస్ట్ కావాలన్నదే తన లక్ష్యమని, తప్పక సాధిస్తానన్నారు. ప్రతిరోజు గురుకుల పాఠశాలలో టీచర్స్ సూచనలు, సలహాల మేరకు.. స్టడీ అవర్స్ లో మెటీరియల్స్ ఉపయోగిస్తూ అనునిత్యం ప్రాక్టీస్ చేయడం ద్వారానే తాను మంచి గ్రేడ్ పాయింట్స్ తో ఉత్తీర్ణత సాధించానని పేర్కొన్నారు.

పేదింట్లో పుట్టిన ఈ చదువుల తల్లి.. పదిలో ది బెస్ట్ అనిపించుకుంది !

ఈ సందర్భంగా లోకల్ 18తో అమ్మమ్మ గోవిందు దేవమ్మ, తాతయ్య గోవిందు దేవయ్యలు మాట్లాడుతూ తమ మనవడు ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివి 9.8 GPA సాధించడం ఎంతో గర్వంగా సంతోషంగా ఉందని భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుత సమాజంలో కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులే ఉత్తీర్ణత సాధించలేని సందర్భాలు కోకొల్లలు.. అయితే ప్రభుత్వ గురుకుల పాఠశాలలో తన అమ్మమ్మ, తాతయ్య సపోర్టుతో చదువుతున్న హర్షవర్ధన్.. అత్యుత్తమ ప్రతిభ కనబరచారని చెప్పాలి. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో పాటు ఉపాధ్యాయులు, పట్టణ ప్రజలు విద్యార్థి హర్షవర్ధన్ ను అభినందిస్తున్నారు. తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా మనమందరం కోరుకుందాం !

2024-05-01T05:40:30Z dg43tfdfdgfd