అయ్యో పాపం : చెరుకు రసం మెషీన్ లో ఇరుక్కుని వేళ్లు తెగిపోయాయి

అయ్యో పాపం : చెరుకు రసం మెషీన్ లో ఇరుక్కుని వేళ్లు తెగిపోయాయి

సమ్మర్ సీజన్ లో చెరుకు రసం అమ్మి నాలుగు డబ్బులు వెనుకేసుకుందామనుకున్న ఓ వ్యక్తి.. తన చేతి వేళ్లను కోల్పోయాడు. చెరుకు రసం తీసే క్రమంలో మెసీన్ లో చేయి ఇరుక్కుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.  పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

యంత్రంలోకి చెరుకు గడలు తోసే క్రమంలో చెయ్యి ఇరుక్కుపోయి.. అతని చేతి వేళ్లు నాలుగు తెగిపోయాయి. దీంతో అతను బాధతో కేకలు పెండుతూ నరకం చూశాడు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటినా పోలీసులు అక్కడకు వచ్చి.. గ్యాస్‌ కట్టర్‌ సాయంతో శ్రమించి చెయ్యి విడిపించారు. ఆ వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. 

అయితే, అప్పటికే తీవ్ర రక్తస్రావం జరగింది. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో అతను చాలా రక్తం కోల్పోయాడని, అతని పరిస్థితి విషమంగా ఉందని  డాక్టర్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ చాలా జరిగాయి. ఇలాంటి పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-01T05:26:02Z dg43tfdfdgfd