అయ్యో రామ రామా.. ఫేం సింగర్ రాము తో లోకల్18 స్పెషల్ ఇంటర్వ్యూ !

అంగవైకల్యం అనేది తనువుకే గాని మనసుకు కాదని నిరూపిస్తున్నాడు జగిత్యాల జిల్లా మేడిపల్లి కి చెందిన రవి అనే అంధుడు . చిన్నప్పుడే పోలియో వచ్చి రవికి కళ్ళు పోవడం జరిగింది. తండ్రి లేడు.అన్ని తానై అతనితల్లి రవిని పెంచిపెద్ద చేసింది.రవికి ఊహ తెలిసినప్పటి నుండి దేవుళ్ళ గుడి వద్ద బిక్షాటన చేస్తూ రవి కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. కానీ రవికి దేవుడు కళ్ళు ఇవ్వకున్నా మంచి కంఠం ఇచ్చాడు..

తన కంఠంతో కొండగట్టు ఆలయ పరిసర ప్రాంతాల్లో పాటలు పాడుతూ భిక్షాటన చేస్తూ ఉంటాడు.. అంజన్న దర్శన కోసం వచ్చే భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో జానపద కళాకారిణి సింగర్ లావణ్య,రవిని తన స్టూడియోకు పిలిపించుకొని అయ్యో రామ రామ.రామ..అనే సాంగ్ ను పాడించింది.. ముగ్గురు పాడే పాటను రవి ఒక్కడే పాడడంతో ఆ పాట లక్షల్లో ప్రజలు వీక్షించడంతో రవికి మంచి పేరు వచ్చింది.

---- Polls module would be displayed here ----

దాని తర్వాత కూడా మరో రెండు జానపద పాటలు పాడి రవి అందరి ఆదరణ అభిమానులను పొందుతున్నాడు.. ఇదే విషయంపై న్యూస్ 18రవిని పలకరించింది.. తనకు పాట పాడే అవకాశం ఇచ్చిన సింగర్ లావణ్య కు కృతజ్ఞతలు తెలిపారు .. చిన్ననాటి నుండి తానుఎంతో కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు.. సాంగ్స్ పాడే టైం ఉన్నప్పుడు అటు వెళ్తానని..లేని టైం లో ఇక్కడే బిక్షాటన చేసుకుంటాననిరవి వివరించారు..

కళ్ళు లేవని బాధపడకండి..దేవుడు మనకు ఏదో ఒక అవకాశం ఇస్తారుదానిని సద్వినియోగం చేసుకోవాలని రవి సూచించాడు. తనకు ప్రభుత్వం కూడా ఎలాంటి సహాయం చేయలేదని అంటున్నారు. తమకు ఉండడానికి ఇల్లు లేదని, ప్రభుత్వం తమకు ఇల్లు మంజూరు చేస్తేఎంతో రుణ పడి ఉంటానని న్యూస్ 18కి సింగర్ రవి తెలిపాడు..

2024-04-23T12:40:07Z dg43tfdfdgfd