ఆ ఇండియన్ భాషలో విడుదలవుతోన్న ఫస్ట్ మూవీగా పుష్ప రికార్డ్..

అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప తర్వాత ప్రస్తుతం పుష్ప2ను (Pushpa2) చేస్తోన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈచిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఎక్కడా తగ్గకుండా సుకుమార్ (Sukumar) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోంది. సునీల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ్, ఫాహద్ ఫాజిల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న పుష్ప 2 సినిమాను ఎట్టి పరిస్థులోనైనా ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్‌గా థియేటర్స్‌లో విడుదల చేయాలనీ టీమ్ ప్రయత్నిస్తోంది. ఇక ఆమధ్య అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా టీమ్ నిన్న టీజర్‌ను విడుదల చేయగా.. అదిరే రెస్పాన్స్ దక్కించుకుంది.

ఇక విడుదల తేది దగ్గరపడుతుండడంతో ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్‌ను టీమ్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫస్ట్ సింగిల్ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు విడుదలకానుంది. ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో విడుదలకానున్న నేపథ్యంలో.. ఈ పాటలను 5 భాషల్లో విడుదలకానున్నాయి. అంతేకాదు అదనంగా బెంగాలీ భాషలో కూడా ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో బెంగాలీలోకి కూడా అడుగు పెడుతున్న మొదటి హీరోగా అల్లు అర్జున్ నే నిలిచినట్లు అయ్యింది.

ఇక అది అలా ఉంటే.. ఈ సినిమాలో ఒక్క ఎపిసోడ్ కోసం ఏకంగా 60 కోట్లు ఖర్చు చేస్తున్నారట టీమ్. ఇంటర్వెల్‌లో వచ్చే ఈ సీన్ సినిమాలో హైలెట్‌గా ఉంటుందట. ఈ గంగమ్మ జాతర పాట కూడా ఈ ఎపిసోడ్‌లోనే ఉంటుందట. కేవలం ఆరు నిమిషాల పాటు ఉండే ఈ సీక్వెన్స్‌కు రూ. 60 కోట్లు వరకు ఖర్చు అయిందని టాక్. ఈ ఒక్క సన్నివేశం చిత్రీకరణకు సుమారు నెలరోజులు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో ధర పలికిందని తెలుస్తోంది. విషయంలోకి వస్తే.. రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన పుష్ప 2: ది రూల్ అద్భుతమైన విజువల్స్, గ్రిప్పింగ్ స్టోరీలైన్‌‌తో రావడంతో.. ఈ సినిమాకు ఓ రేంజ్‌లో, థియేట్రికల్‌తో పాటు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరుగుతోంది. అందులో భాగంగా మ్యూజిక్ లేబుల్, చిత్ర నిర్మాణ సంస్థ T-Series, ప్రపంచ వ్యాప్తంగా మ్యూజిక్ రైట్స్‌ను, హిందీ శాటిలైట్ టీవీ హక్కులను దాదాపుగా 60 కోట్ల రూపాయలకు దక్కించుకుందని తెలుస్తోంది.

ఇక తెలుగు శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే ధర ఎంతన్నది మాత్రం వెల్లడికాలేదు. ఇక డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. "పుష్ప 2 : ది రూల్" OTT హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ 100 కోట్ల రూపాయలను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. పుష్ప2 సినిమాకు కొనసాగింపుగా పుష్ప3 కూడా రానుందట. అందులో భాగంగా పుష్ప 3 కి సంబందించిన కొన్ని సన్నివేశాలను మేకర్స్ ఇప్పటికే చిత్రీకరించినట్లు సమాచారం. అంతేకాదు ఈ పుష్ప 3 ను వచ్చే ఏడాది సమ్మర్‌కి విడుదల చేయనున్నారట.

ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్, తన తదుపరి సినిమాను త్రివిక్రమ్‌తో చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు త్రివిక్రమ్ సినిమాను హోల్డ్‌లో పెట్టారట.. అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను అట్లీతో చేస్తున్నారు. ఈ సినిమాను సన్ పిశ్చర్స్ నిర్మిస్తోందని టాక్. అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఇక ఆ తర్వాత బోయపాటి శ్రీనుతో చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్‌లో గతంలో “సరైనోడు” అనే సినిమాతో వావ్ అనిపించారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనుంది. ఇక వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా సినిమా కూడా లైన్’‌లో ఉన్న సంగతి తెలిసిందే.

2024-05-01T09:56:13Z dg43tfdfdgfd